బ్రేకింగ్ : మక్కా బాంబు పేలుళ్ల కేసు కొట్టివేత

మక్కా బాంబు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన సంఘటన తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత ఈ కేసులో కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*