మూడింట మోడీ లెక్కంత?

క‌న్న‌డ‌నాట మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆరు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. మూడు ఎంపీ స్థానాల‌తో పాటు మ‌రో మూడు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇందులో రెండు అసెంబ్లీ స్థానాలు జ‌య‌న‌గ‌ర‌, ఆర్ఆర్‌(రాజ‌రాజేశ్వ‌రి) అసెంబ్లీ స్థానాల‌కు ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇక మిగిలిన స్థానాల‌కూ త్వరలోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ‌ను రేపిన విష‌యం తెలిసిందే. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో జ‌రిగిన ప‌రిణామాల‌న్నీ విదిత‌మే.

మూడు ఎంపీ స్థానాలకు….

ఇక విష‌యానికి వ‌స్తే.. బళ్లారి నుంచి ఎంపీగా ఉండే శ్రీరాములు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాదామితో పాటు మొల‌కాళ్మూరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. అయితే బాదామిలో కాంగ్రెస్ నేత‌, మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య చేతిలో స్వ‌ల్ప‌తేడాతో ఓట‌మి పాల‌య్యారు. మొల‌కాళ్మూరులో మాత్రం విజ‌యం సాధించి, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే శివమొగ్గ నుంచి ఎంపీగా ఉండే య‌డ్యూర‌ప్ప ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శికారిపుర నుంచి బ‌రిలోకి దిగి విజ‌య‌వం సాధించారు. అయితే వీరిద్ద‌రూ త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయగా.. స్పీక‌ర్ ఆమెదించ‌డంతో లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య 272కు చేరింది. దీంతో ఈ రెండు పార్ల‌మెంటు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మాండ్యా జేడీఎస్ ఎంపీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. ఇక్క‌డ కూడా ఉప ఎన్నిక‌లు త‌ప్పేలా లేదు.

కుమారస్వామి భార్య అనిత….

అలాగే.. జ‌య‌న‌గ‌ర బీజేపీ అభ్య‌ర్థి బీఎన్ విజ‌య్‌కుమార్‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో అక్క‌డ ఎన్నిక‌లు వాయిదా వేసి జూన్ 11 నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఆర్ ఆర్ న‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంటులో న‌కిలీ ఓట‌రు కార్డులు దొర‌క‌డంతో అక్క‌డ కూడా వాయిదా వేసి, ఈనెల 28న నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో జ‌య‌న‌గ‌ర నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి సౌమ్యారెడ్డి బ‌రిలో ఉన్నారు. బీజేపీ ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. విజయ్‌కుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్ పోటీ చేయనున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థిని నిలుపుతాయా లేదా అన్న విషయంపై కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. రెండు స్థానాల్లోనూ గెలిచిన జేడీఎస్ నేత కుమార‌స్వామి రామ‌న‌గ‌ర స్థానానికి రాజీనామా చేయ‌డంతో అక్క‌డి నుంచి ఆయ‌న‌ మొదటి భార్య అనిత(54) ఉప ఎన్నికల బరిలో దిగుతున్న ప్ర‌చాంర జ‌రుగుతోంది.

ఉమ్మడిగానే నిలపాలని…..

ఇదిలా ఉండ‌గా… ఎన్నిక‌ల అనంత‌రం జ‌త‌క‌ట్టి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ఇప్ప‌డు ఉప ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి మ‌రిన్ని క‌ష్టాలు ఎద‌రైన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌ద‌కొండు నెల‌ల స‌మ‌యం ఉండ‌డంతో దాదాపుగా ఈ మూడు పార్ల‌మెంటు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని, వీటిల్లో నెగ్గ‌డం బీజేపీ క‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ క‌న్న‌డ‌నాటనే ఏక‌మై స‌మ‌ర‌శంఖం పూరించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*