ఎన్టీఆర్ గా బాలయ్య … భయపడ్డ బాబు ..?

ntr biopic telugu post telugu news

విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ గెటప్ లో తన బావమరిది బాలకృష్ణ బయోపిక్ తీసేందుకు రెడీ అయిన వెంటనే బావ చంద్రబాబు భయపడ్డారట. ఈ విషయం స్వయంగా ఎపి సిఎం వెల్లడించి సంచలనం సృష్ట్టించారు. తన మామ ఎన్టీఆర్ బయోపిక్ చూసేందుకు దర్శకుడు క్రిష్, బాలకృష్ణ లతో కలిసి అమరావతిలో చంద్రబాబు సినిమా చూశారు. ఈ సందర్భంగా చిత్రం తీరును వర్ణీస్తూ బాబు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే చిత్రం చూశాకా మాత్రం బాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

NTR Biopic telugu post telugu news

బాలయ్యపై ప్రశంసల వర్షం …
ఎన్టీఆర్ రూపంలో బాలయ్య నటన ఆహార్యం అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. ప్రతి సన్నివేశం లో ఎన్టీఆర్ మళ్ళీ పుట్టి ఈ వేషాలన్నీ వేశారనే రీతిలో బాలకృష్ణ జీవించారన్నారు. ఇలాంటి సాహసం బాలయ్యకే సాధ్యం. ఎన్టీఆర్ జ్ఞాపకాలు, ప్రజలకు అభిమానులకు గుర్తు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం నుంచి నట ప్రస్థానం, రాజకీయ ప్రవేశం వరకు దర్శకుడు క్రిష్ చక్కగా చిత్రికరీంచారని కొనియాడారు చంద్రబాబు. బాలయ్య చరిత్ర తిరగరాశారని ఎన్టీఆర్ యుగపురషుడు అని తెలుగుజాతి మొత్తం ఈ సినిమా చూడాలన్నారు బాబు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*