మనసు లాగేస్తుందా…?

chandrababaunaidutelugudesamparty national politics

ఏ రంగంలో అయినా.. సీనియ‌ర్ అయిన వ్య‌క్తి ఏం కోరుకుంటాడు? మ‌రింత ఉన్న స్థాయికి ఎద‌గాల‌నే క‌దా?! ఈ విష‌యం లో త‌ప్పు కూడా లేదు. అంచెలంచెలుగా ఎద‌గ‌డాన్ని ఉన్న స్థాయిని చేరుకోవ‌డాన్ని కూడా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు కూడా.. ! అయితే, ఇదే విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ధ‌ర్మ సంక‌టం ప్రారంభ‌మైంది. ఆయ‌న చెప్పుకొంటున్న మాటల ప్ర‌కారం.. దేశంలోనే చంద్ర‌బాబు చాలా సీనియ‌ర్. ఏపీని మ‌రో నాలుగు మాసాలు గ‌డిస్తే.. ప‌ద్నాలుగున్న‌రేళ్లు పాలించి న రికార్డును కూడా ఆయ‌న సొంతం చేసుకోనున్నారు. మ‌రి ఇంత సీనియార్టీని కైవ‌సం చేసుకున్న చంద్ర‌బాబుకు ప్ర‌మోష‌న్‌ కావాల‌ని కోరుకోవ‌డం త‌ప్పులేదు.

సీనియర్ నని చెబుతున్న……

సీఎంను మించిన ప‌ద‌వి ఏముంటుంది.. ఒక్క ప్ర‌ధాని ప‌ద‌వి త‌ప్ప‌! సాధార‌ణంగా.. ఒక‌టి రెండు సార్లు సీఎం అయిన నాయ‌కుల‌కే పీఎం ప‌ద‌విపై వ్యామోహం పెరిగిపోతుంది. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇలా వ‌చ్చిన నాయ‌కుడే క‌దా? ఇక‌, రెండు సార్లు బెంగాల్‌కు సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీకి కానీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం మాయావ‌తికి కానీ, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్‌కు కానీ.. పీఎం పీఠంపై ఎంత మ‌క్కువ ఉందో ఇట్టే తెలుస్తుంది. మ‌రి వీరిక‌న్నా తాను సీనియ‌ర్ న‌ని చెబుతున్న చంద్ర‌బాబుకు మాత్రం ఈ పీఠంపై ఆశ ఉండ‌దా? అంటే ఉంటుంది. నిజానికి ఆయ‌న మ‌న‌సంతా కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉంది.

దేశ రాజకీయాల గురించే….

తెల్ల‌వారి లేచింది మొద‌లు. ఢిల్లీ రాజ‌కీయాల గురించే చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా మాట్లాడుతున్నారు. బీజేపీని.. ప్ర‌ధాని మోడీని గ‌ద్దె దించే వ‌రకు తాను నిద్ర‌పోన‌ని కూడా శ‌ప‌థాలు చేశారు. దీంతో కొన్ని రోజుల కింద‌ట బాబు చేసిన హ‌డావుడి తో ఇక‌, ఏపీ నుంచి ఢిల్లీకి చంద్ర‌బాబు మ‌కాం మార్చేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా సాగింది. అంత‌లా బాబు.. ఢిల్లీపై మ‌న‌సు పారేసుకున్నారు. అయితే, ఇది ఏపీలో పార్టీని ఎక్క‌డ ముంచుతుంద‌ని అనుకున్నారో ఏమో. వెంట‌నే దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఏపీకే ప‌రిమిత‌మ‌వుతాన‌ని చెప్పుకొచ్చారు. అయినా కూడా చంద్ర‌బాబు మ‌న‌సులో మాత్రం ఢిల్లీ రాజ‌కీయాలు సుడులు తిరుగుతూనేఉన్నాయి.

దూరమని చెప్పలేదే…..

ఈక్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇటీవలలో మీడియాతో మాట్లాడిన బాబు.. ‘రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదులుకున్నారు. ఈసారి ఏం చేస్తారు’ అని ఒక విలేకరి అడుగగా.. ‘దీని గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదు’ అని సీఎం త‌ప్పించుకున్నారే త‌ప్ప‌..గ‌తంలో మాదిరిగా త‌న‌కు పీఎం పీఠానికి క‌డుదూరం అని చెప్ప‌లేదు! సో.. దీనిని బ‌ట్టి.. బాబు మ‌న‌సు ఢిల్లీలో మ‌నిషి ఏపీలో ఉన్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*