పొత్తుల పనిలో అంతా బిజీ …!!

తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల కోసం విపక్ష పార్టీలు చర్చలు మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్ ప్రచార జోరుకు బ్రేక్ వేయాలంటే తక్షణం పొత్తుల అంశం తేలిపోవాలని విపక్ష పార్టీలు అదే పనిలో బిజీగా వున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా టిడిపి పొత్తు ముచ్చట్లు ఆరంభించింది. చంద్రబాబు తెలంగాణ టిడిపికి స్వేచ్ఛ కల్పించడంతో టి టిడిపి కమిటీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేసింది. అందులో భాగంగా మూడు కమిటీలు ఇప్పటికే ప్రకటించింది. సమన్వయ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు అయిపోయాయి.

సిపిఐ తో చర్చలు …

టిటిడిపి పొత్తుల్లో భాగంగా తొలిదఫాలో సిపిఐ తో భేటీ అయ్యింది. సిపిఐ నేత చాడా వెంకట రెడ్డితో పొత్తు చర్చలు ప్రథమార్ధం పూర్తి అయ్యింది. కెసిఆర్ ను వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి ఢీ కొట్టి ఓడించాలన్నదే ప్రధాన ఎజెండాగా రెండు పార్టీలు సమాలోచనలు సాగించాయి. దీనితరువాత టి జేఏసీ నేత కోదండరాం బృందం తో కూడా టిటిడిపి చర్చించనుంది. ఇక కాంగ్రెస్ పార్టీతో చిట్ట చివరిగా చర్చించి మాహాకూటమిగా ఏర్పడాలన్న ఆలోచనతో విపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి.

సిపిఎం తో జనసేన …

ఇక జనసేన సైతం తెలంగాణ లో తమ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీపీఎం నేతలతో చర్చలు మొదలు పెట్టేశారు. ఈనెల 11వతేదీన మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. టి ఎన్నికల్లో పొత్తుల గొడవ పూర్తి అయితే పవన్ ఎన్నిసీట్ల లో తమ పార్టీ పోటీ చేయాలి..? మిత్రపక్షానికి ఎన్ని సీట్లు కేటాయించాలి అన్న అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. తెలంగాణాలో పవన్ జనసేన కాంగ్రెస్ తో కలిసి పనిచేసే అవకాశాలు మాత్రం తక్కువే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమి జరుగుతుందో వేచి చూడక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*