ఆయనను “మార్చండి“ బాబూ..!!

chandrababu naidu rajendraprasad

రాజ‌కీయంగా ఏ పార్టీలో అయినా నాయ‌కులు ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత‌కు ప్ల‌స్ కావాలి. కుదిరితే .. పార్టీని డెవ‌లప్ చేయాలి. లేక‌పోతే.. క‌నీసం మైన‌స్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్న టీడీపీని అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పోనీ.. ఇది చేత‌కాక‌పోతే.. పార్టీలోని కీల‌క నాయ‌కులు మౌనంగా అయినా ఉండాలి. కానీ, మైన‌స్ చేసే ప‌నిచేస్తే.. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌కు వ‌స్తున్న ప‌రిణామం. రాజ‌కీయాలకు కీల‌క కేంద్ర‌మైన కృష్ణా జిల్లాలో టీడీపీకి సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. రావ‌డాన్ని క‌రెంట్ పాలిటిక్స్‌పై కౌంట‌ర్లు వేయ‌డాన్ని కూడా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. పైగా.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది.

పరువు పోతుందే…..

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌కు చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న విసురుతున్న కామెంట్లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం వేస్తున్నాయి. దీంతో బుద్దా ప్రెస్ మీట్ అంటే.. ప్ర‌జ‌లు విర‌గ‌బ‌డి చూస్తున్నారు. గ‌తంలో రికార్డు చేసే ఈయ‌న ప్రెస్ మీట్ల‌ను ఇప్పుడు లైవ్‌లో ఇస్తున్నారు. చాలా నిర్మాణాత్మ‌కంగా, పార్టీకి ఇబ్బంది లేకుండా ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించేలా బుద్దా కామెంట్లు ఉంటున్నాయి. అయితే, ఇదే జిల్లా కు చెందిన పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు సీనియ‌ర్ అయిన‌ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ శైలితో పార్టీ ప‌రువు కృష్ణా న‌దిలో క‌లిసిపోతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న కూడా క‌రెంట్ ఎఫెయిర్స్‌పై స్పందిస్తున్నారు.

బాబు వార్నింగ్ ఇచ్చినా…

అయితే, ఆ స్పంద‌నే నిర్మాణాత్మ‌కంగా లేక‌పోగా.. టీడీపీని దెబ్బతీసేలా.. మ‌ళ్లీ ఆయ‌న చేసిన కౌంట‌ర్ల నుంచి పార్టీని కాపాడుకునేందుకు నేరుగా పార్టీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగేలా ఉంటున్నాయి. గ‌తంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిని ఉద్దేశించి ప్రైవేటు వ్యాఖ్య‌లు బ‌హిరంగంగా చేసి ప‌రువు పోగొట్టుకుని పార్టీని కూడా బ‌జారున ప‌డేశాడు. భార‌తి ఏమ‌న్నా సీతా! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించ‌గా అవి విక‌టించాయి. ఇక‌, రోజాను శూర్ఫ‌ణ‌క‌తో పోల్చి చేసిన కామెంట్లు కూడా ర‌క్తి క‌ట్ట‌లేదు. దీంతో చంద్ర‌బాబు ఇచ్చిన వార్నింగ్ దెబ్బ‌కు దాదాపు రెండు నెల‌ల పాటు మీడియా ముందుకు కూడా రాలేదు.

మరోసారి దుమారం….

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చిన రాజేంద్ర‌.. రచ్చ‌ర‌చ్చ చేశాడు. తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియ‌ని స్థితిలో ఆయ‌న మీడియా మీటింగ్ పెట్టాడ‌ని సొంత పార్టీ నాయ‌కులే కామెంట్లు చేస్తున్నారు. చంద్ర‌బాబు ఒక్క క‌నుసైగ చేస్తే.. బీజేపీ నేత‌లు ఎవ‌రూ రోడ్ల‌మీ ద తిర‌గ‌లేరు- అంటూ రాజేంద్ర చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్గ‌తంగా తీవ్ర దుమారం రేపాయి. అంటే.. బాబు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ అనే అర్ధం వ‌చ్చేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యానించార‌ని పార్టీలోని సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయ‌న చ‌ర్య‌ల‌కు మ‌ళ్లీ రెడీ అవుతున్నారు., అమ‌రావ‌తికి రావాల‌ని ఇప్ప‌టికే ఎమ్మెల్సీకి పిలుపు వ‌చ్చింది. ఎన్నిక‌ల వేళ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే.. ప‌రువు ఆయ‌న‌దొక్క‌డిదే కాదు.. పార్టీకి కూడా నష్ట‌మేన‌ని రాజేంద్ర తెలుసుకోవాలి. ఇప్ప‌టికే ఆయ‌న బూతు పురుణం వీడియో ఒక‌టి యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌రి ఇలాంటి వారిని మార్చాల్సిన అవ‌స‌రం ఉంది బాబూ అంటున్నారు సీనియ‌ర్లు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*