ఈ గొడవేంటి బాబూ …?

ysr congressparty in cudapah assembly constiuency

జగన్ పై హత్యాయత్నం ఘటన పూర్తి రాజకీయ రంగు పులుముకుంది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి కేంద్ర ఎన్ ఐ ఎ దిగింది. అప్పటినుంచి టిడిపి లో గుబులు బయలుదేరింది. దీనిపై నేరుగా ప్రధాని కే లేఖ రాసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాన్ని మరింత పెద్దది గా మార్చారు. ఈ కేసు అతి చిన్నదిగా లేఖలోనే బాబు పేర్కొనడం అలాంటి చిన్న విషయానికి ఎందుకు తత్తరపాటు అన్న అనుమానాలు రేకెత్తేలా ముఖ్యమంత్రి లేఖ ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. ఒక్క వైసిపినే కాదు ఇప్పుడు అందరిలో ఆ అనుమానం మరింత బలపడేలా మారింది.

ఒక తప్పు తరువాత మరొకటి …

గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఎలాగో విపక్ష నేత పై కత్తి దాడి కేసు ను ఎపిసర్కార్ తన మెడకు చుట్టుకునేలా చేసుకోవడం చూస్తే అర్ధం అవుతుంది. నేరుగా టిడిపి సర్కార్ పైనా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలపై వైసిపి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలోనూ, ప్రజల్లో నెలకొన్న అనుమానాల నివృత్తికి తమ ఆధీనంలో వున్న దర్యాప్తు సంస్థ తో కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించి ఉంటే ఈ వ్యవహారం ముగిసిపోయేది.

అనవసర రాద్ధాంతమే…..

కానీ సర్కార్ అనవసర రాద్ధాంతం తెచ్చి పెట్టుకోవడమే కాక కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎన్ఐఏ కు సహకారం అందించకపోవడం వివాదాస్పదం అయ్యింది. ఇక దర్యాప్తుకు వ్యతిరేకంగా నేరుగా ప్రధానికి ఒక ముఖ్యమంత్రి లేఖ రాయడం మరింత చర్చనీయాంశం అయిపొయింది. హత్యాయత్నం వైసిపి డ్రామా అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చిన టిడిపి ఈ తరహాలో కేంద్ర దర్యాప్తును అడ్డగించాలనుకోవడం లేనిపోని అనుమానాలకు దారితీసేలాగే వుంది అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*