బాబుకు అసలైన పండగ ఇదే …?

chandrababunaidu-festival-feet

వచ్చేవి ఎన్నికలు. దాంతో ప్రజలను ఆకట్టుకోవడానికి అధికారంలో వుండే పార్టీలు చేయని పని… వేయని ఫీటు ఉండదు. ప్రజాధనం దుర్వినియోగంలో సరికొత్త రికార్డ్ లు నెలకొల్పే దిశగా ఎపి సర్కార్ మరో నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై విమర్శల పాలు అయ్యింది. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు కోట్లాది రూపాయలు నీళ్ళల్లో కలిపేసిన సర్కార్ అప్పుడు వచ్చిన ఆరోపణలు, విమర్శలను తోసి రాజని తాము అనుక్కున్నదే చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

జిల్లాకు కోటిరూపాయలతో …

మకర సంక్రాంతి పండగ ప్రతి ఇంట సంబరాలు సాధారణంగానే వెల్లివిరుస్తాయి. దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా చేయాలిసింది ఏమి లేదు. అనేక స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక, సాహిత్య, కళావేదికల ప్రదర్శనలు యధావిధిగా నడుస్తాయి. కొత్త బట్టలు, భోగి మంటలు, గొబ్బిళ్ళు, పతంగులు, కోడిపందాలు సందడి వేటికవే సాగుతాయి. ఇవన్నీ బాగా తిలకించాలంటే పల్లెబాట పట్టి నగరవాసులు ఎంజాయ్ చేస్తూ వుంటారు. కానీ ఈసారి సంక్రాంతిని సైతం ఈవెంట్ గా ఎన్నికల ఏడాది కావడంతో సర్కార్ మార్చేసింది. జిల్లాకు కోటి రూపాయలు కలెక్టర్లకు కేటాయించింది. దాంతో 13 జిల్లాలకు ఈ నిధులు మంజూరు చేయడం మరోసారి విమర్శలకు ఆరోపణలకు దారి తీయనుంది.

గంగిరెద్దుల నుంచి అన్ని …

ప్రతి జిల్లాకు నిధులు కేటాయించినప్పటికీ గంగిరెద్దులు, హరిదాసుల నుంచి, హరికథలు, బుర్ర కథలు చెప్పేవారి వరకు కొందరికి ఈ పనులు అప్పగించేలా మౌఖిక ఆదేశాలు వెళ్లాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహణకు కార్పొరేషన్ ప్రాంతాలకు ఒకలా మునిసిపాలిటీలు పంచాయితీలు ఇలా జనాభాను బట్టి నిధులను రెవెన్యూ శాఖ నిర్ణయిస్తుంది. అయితే ముగ్గుల నుంచి పూలదండలు, టెంట్లు, దండాలు ఇలా అవసరమైన సామాగ్రి అంతా ఒకరే నామినేషన్ పై చేపడతారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దుబారాతో లబ్ది…….

నిధుల దుబారాతో బాటు తమవారి లబ్ది పొందేలా మిగిలిన కాంట్రాక్టల్లాగే ఈ వ్యవహారం సాగనుందని ప్రచారం నడుస్తుంది. వాస్తవానికి ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నవారికి కానీ ప్రజలకు పండగ కాదన్న సెటైర్స్ ఇప్పుడే మొదలు కావడం గమనార్హం. దీనికి బదులు సంక్రాంతి పండగకు పేదలకు అన్నవస్త్రాలను ఉచితంగా ప్రభుత్వం పంచినా ప్రయోజనం కొందరికైనా దక్కుతుందని కొందరు సూచిస్తున్నారు. కానీ తాము తలచిందే శాసనం గా ఏలినవారు చేపడుతున్న పనులు చేసుకుపోవడాన్ని మాత్రం జనం నిలదీయడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*