రాజప్ప విజయం వెనుక … రీజన్స్ ఇవేనా …?

chinarajappa-telugudesam-peddapuram

ఒకే పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న నేతగా సౌమ్యుడు గా పేరు తెచ్చుకున్న హోం మంత్రి, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప గెలుపు అంత ఈజీ కాలేదు. జగన్ సునామీని తట్టుకుని ఒడ్డున పడ్డ వీరుల్లో ఆయన ఒకరు. టిడిపి హేమా హేమీలంతా కట్టకట్టుకుని ఓడిపోయినా రాజప్ప తన రాజసాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా లో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపేందుకు సిద్ధం అయ్యారు. రాజప్ప గెలుపు ను పరిశీలిస్తే….

అభివృద్ధి, అందుబాటులో …

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గాన్ని గణనీయంగా అభివృద్ధి బాటలో నడిపించారు చినరాజప్ప. హోం మంత్రిగా డిప్యూటీ సిఎం హోదా ఉన్నప్పటికీ సామాన్యుల్లో ఒకడిగా తన నియోజకవర్గంలో ఆయన కలిసిపోవడం తో తీవ్ర ప్రజావ్యతిరేక ప్రభంజనాన్ని తన వ్యక్తిగత ఇమేజ్ తో అడ్డుకోగలిగారు రాజప్ప. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పరితపించడం ఆయనకు కలిసి వచ్చింది. దీనికి తోడు వైసిపి లో చివరిక్షణంలో పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న తోటవాణి కి సొంత పార్టీలో ముందునుంచి ఉన్న వారు కలిసి రాకపోవడం చినరాజప్పకు వరమైంది.

జనసేనకు చెక్ పెట్టి, వైసిపి ని ఢీ కొట్టి ….

ఇక జనసేన ప్రభావాన్ని పరిమితం చేయడంలో, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. గతంలో పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజారాజ్యం నుంచి పంతం గాంధీ మోహన్ గెలిచారు. ఆ లెక్కల పై పూర్తి అవగాహనా వున్న రాజప్ప గత ఏడాదిగా తన నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ పెంచారు. ఫైనల్ గా పోల్ మేనేజ్ మెంట్ గా చెప్పే డబ్బుల పంపిణీలో తన ప్రత్యర్థులకన్నా పైచేయి సాధించడంతో వైసిపి తుఫాన్ లో కొట్టుకుపోకుండా నిలబడిన కొద్ది మందిలో ఒకరయ్యరు. తూర్పు గోదావరి జిల్లా నుంచి టిడిపి కి నలుగురు ఎమ్యెల్యే లు గెలిస్తే వారిలో కాపు సామాజిక వర్గం నుంచి రాజప్ప గెలవడం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 18020 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*