సీకే వస్తే జెండా ఎగిరినట్లేనా….??

ck-babu-telugudesamparty

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెరిగిందా? ఏ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత జిల్లాలో మాత్రం చేదు అనుభవమే ఎదురవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించుకోలేదు. ఇది చంద్రబాబుకు ఒకింత ఇబ్బందికరమైన అంశమే. ఈసారి ఎలాగైనా చిత్తూరులో బలం పెంచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, అమర్ నాధ్ రెడ్డి వంటి నేతలను పార్టీలో చేర్చుకుని బలం పెంచుకోగలిగారు. ఈసారైనా చిత్తూరులో టీడీపీ సీట్లు పది స్థానాలకు మించి రావాలన్నది చంద్రబాబు టార్గెట్ గా తెలుస్తోంది.

బలం పెరుగుతుందని…..

దీంతో తనకు ఇష్టం లేని నేతలను కూడా పార్టీలో చేర్చకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబును పార్టీలోకి చంద్రబాబు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. సీకే బాబు రాకతో దాదాపు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుంది. సీకేబాబుకు చిత్తూరు నియోజకవర్గంతో పాటు పూతలపట్టు, జీడీనెల్లూరులో కొంత పట్టుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో సీకే బాబు కొంత మేర ప్రభావం చేయనున్నారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరునియోజవకర్గాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను చంద్రబాబు సీకే బాబుకు అప్పగించారు.

గత ఎన్నికలలో….

సీకేబాబు గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాదాపు బీజేపీతో సహా అన్ని పార్టీలూ మారిపోయారు. తొలుత వైసీపీలో చేరిన సీకే బాబు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులుకు మద్దతిచ్చారు. ఈఎన్నికల్లో జంగాలపల్లి గెలుపుకోసం సీకేబాబు తీవ్రంగానే శ్రమించారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశతో ఆయన వైసీపీకే గత ఎన్నికల్లో మద్దతుదారునిగా నిలచారు. కానీ ఆ ఎన్నికల్లో సీకే బాబు మనస్ఫూర్తిగా మద్దతిచ్చిన జంగాలపల్లి ఓటమిపాలయ్యారు. దీన్ని టీడీపీలో ఉన్న కొందరు నేతలే ఉదహరిస్తున్నారు.

ఆనాటి పరిస్థితులు లేవని…..

తర్వాత పురంద్రీశ్వరి సాయంతో సీకే బాబు భారతీయ జనతా పార్టీలో చేరారు. కొన్నాళ్లు కాషాయ జెండా పట్టుకుని తిరిగారు. అయినా ఫలితం లేదని గ్రహించారు. 1989లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సీకే బాబు విజయం సాధించారు. తొలుత ఈ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేద్దామని భావించినా పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించి అధికార పార్టీలో చేరిపోయారు. సీకే బాబుది చిత్తూరులో ఇక గత చరిత్ర అని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఆయన పట్ల ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేదని, ఆయన టీడీపీకి మద్దతిచ్చినంత మాత్రాన చిత్తూరులోనే ప్రయోజనం లేదని, ఇక పూతలపట్టు , గంగాధరనెల్లూరుల్లో ఏముంటందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సీకేబాబు కు ఈ ఎన్నికల్లో చంద్రబాబు మూడు నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగించి పెద్ద పరీక్షే పెట్టినట్లుంది.

Ravi Batchali
About Ravi Batchali 15694 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*