స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి …?

కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి కి చేతినిండా హస్తం పార్టీ పని అప్పగిస్తుందా …? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అత్యంత ప్రతిష్ట గా జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో చిరంజీవి అవసరం పార్టీకొచ్చింది. కర్ణాటకలో తెలుగు వారు అధికంగా ఉండటంతో చిరంజీవి వంటి స్టార్ క్యాంపైనర్ తో ఓట్ల వర్షం కురుస్తుందని హస్తం పార్టీ భావిస్తుంది. దాంతో కీలకమైన ఈ పోరులో చిరంజీవిని రంగంలోకి దింపి కమలం శ్రేణులను పరుగులు పెట్టించాలని టెన్ జన్ పథ్ స్కెచ్ గీసింది. ఆ స్కెచ్ లో భాగంగానే కర్ణాటక వెళ్ళి ప్రచారం చేసే స్టార్ క్యాంపైనర్ ల లిస్ట్ లో చిరంజీవి పేరు చేర్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవి వెళతారా …?

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రం షూటింగ్ లో బిజీ గా వున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగియకముందు ముగిసిన తరువాత కూడా ఆయన రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేరు. ఏపీలో ప్రత్యేక హోదా పై పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నా చిరంజీవి జనంలోకి రాలేదు. దాసరి నారాయణరావు బతికి వున్నప్పుడు మాత్రం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోరాటానికి ఆయనతో కలిసి మద్దతు ప్రకటించారు. దాసరితో కలిసి ముద్రగడ నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసేందుకు వెళ్ళి ప్రభుత్వ నిర్బంధం తో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి వెళ్లిపోయారు. ఆ సందర్భం తప్ప మిగిలిన అనేక అంశాల్లో చిరంజీవి స్పందించింది లేదు. దీనికి తోడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి జోరు మీద ఉండటంతో ఆయన సైలెంట్ గానే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ విజయానికి చిరంజీవి ప్రచారానికి వెళతారా లేదా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మెగాస్టార్ త్వరలోనే క్లారిటీ ఇవ్వొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*