సానుభూతికి చెల్లు.. దేవినేనికి టైట్ అయిందే‌..!

మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల‌కు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదురుకానుందా? ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో నిజ‌మైన ప్ర‌త్య‌ర్థి ఇప్పుడు ఆయ‌నకు త‌న సొంత పార్టీ నుంచే ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం. త‌న పార్టీలో సీనియ‌ర్ నేత‌, వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వైసీపీలో చేర‌డం ఖాయ‌మై పోయింది. ఆయ‌న మైలవ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు దేవినేనికి అస‌లు సిస‌లు పోటీ ఎదురు కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 1999లో రాజ‌కీయాల్లోకి అనూహ్యంగా ప్ర‌వేశించిన దేవినేనికి అప్ప‌టి ఎన్నిక‌ల్లో సింప‌తీ పాళ్లు క‌ల‌సి వ‌చ్చాయి. అప్ప‌ట్లో దేవినేని వెంక‌ట ర‌మ‌ణ దుర్మర‌ణంతో అప్ప‌టి ఎన్నిక‌ల్లో దేవినేని ఆ సింప‌తీని కొట్టేశారు.

వెంకటరమరణ మరణంతో……

నిజానికి అప్ప‌ట్లోనే కాంగ్రెస్‌లో ఉన్న వ‌సంత నాగేశ్వ‌ర‌రావు.. త‌న త‌న‌యుడిని రంగంలోకి దింపారు. దీంతో దేవినేని ఉమాపై అప్ప‌ట్లోనే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ పోటీ చేశారు. అయితే, అప్ప‌టి సింప‌తీ వాతావ‌ర‌ణంలో దేవినేని గెలుపొందారు. అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య హోరా హోరీ పోరు జ‌ర‌గాల్సి ఉన్నా అన్న మాజీ మంత్రి దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆ సింప‌తీ ఉమాకు బాగా క‌లిసొచ్చి ఆయ‌న గెలిచారు. ఇక‌, 2004 ఎన్నిక‌ల్లో వ‌సంత నాగేశ్వ‌ర‌రావు పోటీ చేయ‌డంతో దేవినేని విజ‌యం చేరుకున్నారు.

వైఎస్ చెప్పినా….

2004లో నాటి కాంగ్రెస్ వేవ్‌లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించిన వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న త‌న‌యుడు కృష్ణ‌ప్ర‌సాద్‌ను ప‌క్క‌న పెట్టేసి తానే స్వ‌యంగా పోటీ చేశారు. అప్పుడు వైఎస్ కృష్ణ‌ప్ర‌సాద్‌నే పోటీ చేయించాల‌ని ప‌ట్టుబ‌ట్టినా విన‌లేదు. దీంతో జ‌నాలు వ‌సంత‌ను కాద‌ని ఉమాను 7 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2009లో నందిగామ ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో దేవినేని ఉమా.. నియోజ‌క వ‌ర్గం మారిపోయింది. నందిగామ నుంచి మైల‌వ‌రం వ‌చ్చేశారు. 2009లో ఉమా అప్ప‌సాని సందీప్ అనే రాజ‌కీయ అనుభ‌వం లేని యువ‌కుడిపై విజ‌యం సాధించారు.

ఆఖరి రౌండ్ వరకూ……

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి జోగి ర‌మేష్‌పై పోటీ చేశారు. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మ‌యంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ‌ను ఎదుర్కొన్నారు. ఆఖ‌రి రౌండ్ వ‌ర‌కు కూడా దేవినేని తీవ్ర‌మైన టెన్ష‌న్ ప‌డ్డారు. నిజానికి మైల‌వ‌రంలో దేవినేని సానుకూల వ‌ర్గం, సామాజిక వ‌ర్గం బాగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ .. వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌మేష్‌.. గ‌ట్టి పోటీ ఇచ్చాడు. దీంతో చివ‌రి నిముషంలో చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన చందంగా దేవినేని కొద్ది తేడాతో విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు మాత్రం ఈ ప‌రిస్థితి క‌నిపించే చాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇరువురూ ఒకే సామజిక వర్గం కావడంతో…..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేవినేనిపై పోటీగా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ రంగంలోకి దిగుతుండ‌డం, ఇరువురూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కావ‌డం, ఆర్థికంగా వ‌సంత కుటుంబం బ‌లంగా ఉండ‌డం వంటి ప‌రిణామాలు దేవినేనికి ఎఫెక్ట్ అవుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే దేవినేనిపై స్థానికంగా ఉన్న వ్య‌తిరేక‌త మొత్తం.. వ‌సంత ఫ్యామిలీకి ఉన్న అనుకూల‌త వంటివి కూడా భారీగానే ప‌ని చేస్తాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా దేవినేనికి వ‌సంత నుంచి ట‌ఫ్ ఫైట్‌ ఖాయ‌మ‌నే రేంజ్‌లోనే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*