దేవినేనికి నమ్మకం పోయిందా…??

devineni uma vs vasantha krishnaprasad

ఏపీలో ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యమే ఉంది. అయినా కూడా అధికార పార్టీ నాయ‌కులు, ముఖ్యంగా టైట్ ఫైట్ ఉంటుంద ని, తమ గెలుపు అంత ఈజీకాద‌ని భావిస్తున్న మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు వంటి వారు ఇప్పుడే ప్ర‌చారం ప్రారంభించేశారు. వ‌చ్చే ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉంద‌ని కానీ, ఇప్పుడే ప్ర‌చారం ఎందుకు అని గానీ వారు ఏమాత్ర‌మూ ఆలోచించ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో త‌మ డ‌బ్బా కొట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఒక్క రూపాయిని కూడా జేబు నుంచి మంత్రి వ‌ర్యులు ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కృష్ణా జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దేవినేని.. ఇక్క‌డ తీవ్ర‌మైన వ్య‌తిరేక ప‌వ‌నాల‌ను ఎదుర్కొంటున్నారు.

వసంత రంగంలోకి దిగడంతో…

ముఖ్యంగా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వంటి వైసీపీ నాయ‌కుడు చేతిలో ఓడే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని తెలిసినప్ప‌టి నుంచి దేవినేని మ‌రింత త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఉమాకు గ‌తంలో ఎప్పుడూ లేనంత వ్య‌తిరేక‌త ప్ర‌స్తుతం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి వ‌సంత దూకుడు మీద ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద‌గా దృష్టిపెట్ట‌ని ఉమా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాన్నే అంటి పెట్టుకుని ఉంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అన‌ధికారికంగా ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ సొమ్మును ఆబ‌గా ఖ‌ర్చు చేసేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా దేవినేని ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్రభుత్వ ఖర్చుతో…..

మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా సొంత ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే.. ఇది ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమేనని.. ఇందులో మంత్రి చేసుకుంటున్న సొంత ప్రచారం ఏదీ లేదని ఆయన అనుచరులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. సరే.. ప్రభుత్వ పథకాల కోసమే నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనుకున్నా.. ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి దేవినేని ఉమాకు ముఖచిత్రాలు మినహా ఎవ్వరి ఫోటోలకు ఫ్లెక్సీలో చోటు లేకపోవడం గమనార్హం.

లక్షలాది రూపాయలు చెల్లిస్తూ….

వీటన్నింటిని ఏర్పాటు చేసిన యాడ్స్‌ కంపెనీకి నెలనెలా ప్రభుత్వమే లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. దేవినేని వైఖరితో అధికారపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం.. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమా త‌న గెలుపుపై త‌నే న‌మ్మ‌కం కోల్పాయార‌నే వ్యాఖ్య‌లు విప‌క్షాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతోనే ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల ముందుగానే ప్ర‌చారం ప్రారంభించార‌ని, అయితే, దీనికి ప్ర‌జ‌ల సొమ్మును వినియోగించ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*