అరే..వాటికన్నా ముందుగానేనా?

తెలంగాణాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా మొదలై పోయాయి. అంతా కెసిఆర్ ఆశించినట్లే జరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ల నుంచి అన్ని సౌకర్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక అందించేసింది. ఈనెల 11 న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక టీం రంగంలోకి దిగి క్షేత్ర స్థాయి లో పర్యటించనుంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందే తెలంగాణ లో ఎన్నికలు నిర్వహించేయడానికి సర్వ సన్నాహాలను ఈసీ చేపట్టడం విపక్షాలు మోడీ, కెసిఆర్ జోడి తో బాటు ఎన్నికల సంఘం గులాబీ పార్టీతో చేతులు కలిపిందన్న విమర్శలకు మరింత బలం చేకూరుస్తుంది.

ఊహించని విధంగా ఎన్నికలు …

అత్యధికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కెసిఆర్ టికెట్లు కేటాయించడంతో పాటు ఎన్నికల సమర శంఖం పూరించి ప్రచారం మొదలు పెట్టేశారు. ఆయన వెంటే ఎమ్మెల్యే అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తున్నారు. మరోపక్క విపక్షాలు మాత్రం ఇంకా సర్దుబాట్లు పొత్తుల ఆలోచనలు సమాలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవన్నీ అంచనా వేసి శత్రువు మేల్కొకుండా ముందే దాడి చేయాలన్న కెసిఆర్ లెక్క కరెక్ట్ అయితే నవంబర్ లోనే టి ఎన్నికలు పూర్తి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సంఘం సైతం అదే స్పీడ్ తో దూసుకుపోతూ ఉండటంతో తెలంగాణాలో ప్రతి క్షణం అన్ని పార్టీలకు అత్యంత విలువైనదే. ఊహించని తేదీలకే ఎన్నికలు జరిగే ఈ తరుణాన్ని అందిపుచ్చుకుని అధికార పీఠం అలకరించేది ఎవరో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1