ఫ్యాన్ ఇక్కడ అరుదైన ఫీట్…!!

fan-tsunami-in-uttarandhra-districts

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే టీడీపీకి కంచుకోటలు. వైఎస్సార్ టైంలో కూడా ఇంతలా అవమానం పడిన చరిత్ర లేదు. ఏకంగా ఒక జిల్లాకు జిల్లా టీడీపీ చిత్తు కావడం ఇంతవరకూ జరగలేదు. దానికి బలమైన కారణం జగన్ ప్రభంజనం. దాదాపుగా నాలుగు నెలల పాటు జగన్ చేసిన పాదయాత్ర ఉత్తరాంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మొత్తానికి మొత్తం మార్చేసింది. మావి అనుకున్న చోటనే టీడీపీని పరాయిని చేసేసింది ఫ్యాన్ సునామీ. సీనియర్లు మాకు ఎదురులేదు అనుకున్న వారంతా ఇంటి ముఖం పట్టేశారు.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కి గట్టి షాక్….

కళా వెంకటరావు టీడీపీ ఏపీ విభాగానికి ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఆయన్ని చంద్రబాబు రెండేళ్ళ క్రితం మంత్రిని చేశారు. ఓ వైపు పార్టీ బాధ్యతలు చూస్తూ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర అటువంటి కళాకు ఈసారి ఎన్నికల్లో దారుణమైన ఓటమి సంభవించింది. మరో వైపు ఆయన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతి రావు కుమారుడు కూడా చీపురుపల్లిలో ఓటమి పాలు అయ్యారు. గత ఎన్నికల్లో తనతో తలపడిన గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఈసారి కళా ఓడిపోక తప్పలేదు. నిజానికి జగన్ పాదయాత్ర జిల్లాలో జరిగినపుడే కళా ఓటమికి బీజం పడిపోయింది. రోడ్లూ ..ఊళ్ళు కలగలసిపోయిన విధంగా జనం తరలి వచ్చారు. మొత్తానికి జగన్ గాలి బలంగా వీచి గొర్లె అసెంబ్లీకి వస్తున్నారు.

టీడీపీకి అరడజనే….

ఇక టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో మిత్ర పక్షం బీజేపీ ఒక్క సీటుతో కలుపుకుని పాతిక తెచ్చుకున్న సీన్ ఇపుడు రివర్స్ అయింది. అచ్చంగా ఆరు అసెంబ్లీ సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. విశాఖలో నాలుగు, శ్రీకాకుళంలో రెండు సీట్లలో మాత్రమే ఆ పార్టీ గెలిచి విజయనగరంలో ఖాతా కూడా తెరవని పరిస్థితి ఎదురైంది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ కంచుకోటలని చెప్పడమే కానీ ఆ పార్టీ కూడా పాతిక కంటే సీట్లు ఎక్కువ సాధించలేదు. అలాంటిది 28 సీట్లతో అరుదైన ఫీట్ ని సాధించి జగన్ జై అనిపించేశారు.

Ravi Batchali
About Ravi Batchali 18020 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*