కొత్త వ‌ర్సెస్ పాత ఫైటింగ్‌ మొదలయిందే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ విజ‌యం సాధించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం క‌స‌ర‌త్తు చేస్తుండ‌గా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీల్లో కావాల్సిన‌న్ని లుక‌లుక‌లు ఉన్నాయి. చివ‌ర‌కు ఇక్క‌డ గెలుపు కోసం కేసీఆర్ సైతం స్వ‌యంగా న‌ల్గొండ ఎంపీ లేదా ఆలేరు నుంచి పోటీ చేసేందుకు సైతం రెడీగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ స్వ‌యంగా పోటీ చేస్తార‌ని బూస్ట‌ప్ వ‌స్తున్నా ఆ పార్టీలో లుక‌లుక‌ల‌కు లెక్కేలేదు.

ఆధిపత్య పోరుతో….

ఆంధ్రా – తెలంగాణ ప్ర‌భావం ఉన్న మిర్యాల‌గూడ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం నేత‌లు ఆధిప‌త్య పోరులో త‌ల‌మునక‌ల‌య్యారు. పార్టీ రెండు వ‌ర్గాలు చీలిపోయింది. బ‌హిరంగంగానే రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గానికి ఎవ‌రైనా కీల‌క నేత‌లు వ‌స్తే ఎవ‌రికివారు త‌మ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా ఎమ్మెల్యే న‌ల్ల‌మోతు భాస్క‌ర్‌రావు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి అలుగుబెల్లి అమ‌రేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

కాంగ్రెస్ నుంచి గెలిచి….

గ‌త ఎన్నిక‌ల్లో ఎన్ భాస్క‌ర్‌రావు కాంగ్రెస్ నుంచి అమ‌రేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. భాస్క‌ర్‌రావు గెలిచిన అనంత‌రం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న నేత‌లు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ఇక అప్ప‌టి నుంచి ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావు త‌న వెంట వ‌చ్చిన నాయ‌కుల‌కే ప్రాధాన్యం ఇస్తూ మొద‌టి నుంచి టీఆర్ఎస్‌లో ఉంటున్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఎమ్మెల్యే పై బహిరంగ విమర్శలు….

ఇక పాత నాయ‌కులు ఏకంగా బ‌హిరంగంగానే ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేవ‌లం కాంట్రాక్టు ప‌నులు, క‌మీష‌న్ల కోస‌మే ఆయ‌న అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరార‌ని ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ఏ ప‌నులూకావ‌డం లేద‌నీ, త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌ర్గాన్ని త‌యారు చేస్తున్నార‌నీ అసెంబ్లీ వేదిక‌గా భాస్క‌ర్‌రావు టీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదే విష‌యమై సీఎం కేసీఆర్‌, ప‌లువురు కీల‌క నేత‌లు వీరిద్ద‌రినీ మంద‌లించినా ప‌రిస్థితిలో మార్పు రావ‌డం లేదు. మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇలాంటి ప‌రిస్థితులు మంచివిగావ‌నీ, పార్టీ న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంటుంద‌నీ ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇదిలా ఉండ‌గా న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో పాత‌, కొత్త నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతుండ‌డం ఆ పార్టీ శ్రేణుల్లో ఆంద‌ళ‌న క‌లిగిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీఆర్ఎస్ టిక్కెట్ ఎవ‌రికి వ‌స్తుందో ? కూడా అర్థం కాని ప‌రిస్థితి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*