‘ గద్దే ‘ సీటుకు ఆ మంత్రి ఎర్త్‌..!

ఏపీ కేబీనెట్‌లో సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి వేసే ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఎవరికి అర్థంకావు. రాజకీయంగా జిల్లాల్లో విపక్షాన్ని ఎలా అణ‌గదొక్కుతారో.. అధికారపక్షంలోనూ తనకు పోటీ వస్తారనుకున్న వారిని అదే త‌ర‌హాలో వ్యూహత్మకంగా సైడ్‌ చేస్తారన్న పేరు ఆ మంత్రికి ఉంది. ఈ జిల్లాలో స‌ద‌రు మంత్రి రాజకీయ చాణిక్యంలో ఇప్పటికే ఎంతో మంది సీనియర్లు, జూనియర్లు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఆ మంత్రి వేసే రాజకీయ ఎత్తులతో ఎంతో మంది సొంత పార్టీవాళ్లే చిత్తయ్యారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్‌ అయిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ సీటుకు ? ఎర్త్‌ పెట్టేలా తెర వెనుక పావులు కదుపుతున్నారా ? ఇప్పటికే ఆయన గద్దే సీటుకు ఎర్త్‌ పెట్టే ప్రచారం ప్రారంభించారా ? అంటే కృష్ణా జిల్లాల్లో రాజకీయవర్గాలు అవుననే చెబుతున్నాయి.

గతంలో ఎంపీగా గెలిచి……

గద్దె రామ్మోమోహన్‌ గతంలో విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. 1994లో ఎన్టీఆర్‌ గాలిని తట్టుకుని గ‌న్న‌వ‌రంలో ఇండిపెండెట్‌గా గెలిచిన చరిత్ర సైతం గద్దేకి ఉంది. ప్రస్తుతం గద్దే భార్య అనురాధ‌ కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దే గెలిస్తే సీనియార్టీ హోదాలో అయన తప్పని సరిగా కేబినెట్‌ రేసులో ఉంటారు. పార్లమెంట్‌కు వెళ్లన అనుభవంతో పాటు ఎమ్మెల్యే గెలిచిన అనుభవ నేపథ్యంలో ఆయనకు తప్పని సరిగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. కృష్ణా జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి బాబు కేబినెట్‌లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు బీజేపీ కోటాలో ఎన్నికైన కామినేని శ్రీనివాస్‌ సైతం మంత్రులుగా ఉన్నారు. అయితే కామినేని కొద్ది రోజుల క్రితం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తనకు పోటీ వస్తారని……

ఇక ఎన్నికల తర్వాత వచ్చే కేబినెట్‌లోను గద్దే తనకు ఎక్కడ పోటీ వస్తాడో అన్న సదరు మంత్రి వ్యూహాత్మకంగా గద్దేని ఈ సారి పార్లమెంటుకు పంపిస్తాం… విజయవాడ తూర్పు నుంచి కొత్త వ్యక్తిని రంగంలోకి దింపుతున్నామని తన సన్నిహితుల వద్ద ప్రచారం ప్రారంభిస్తునట్టు తెలుస్తోంది. ట్విస్ట్‌ ఏమిటంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఎంపీ నానితో సదరు మంత్రికి విబేధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆర్థిక కోణం, ఇత‌ర‌త్రా కారణాల నేపథ్యంలో నానిని వ్యూహాత్మకంగా పక్కకు నెట్టి గద్దే రామ్మోహన్‌ను ఎంపీగా పంపిస్తే ఉమాకు మంత్రి రేసు నుంచి పోటీ ఉండదు. దీనిని బట్టి ఆ మంత్రి ఎంత వ్యూహాత్మకంగా ఎతుగడ అమలు చేసున్నారో తెలుస్తోంది.

గద్దె తిప్పికొడుతూ…..

గద్దేని ఎంపీగా పంపిస్తే తూర్పు నుంచి తన కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి సీటు ఇప్పించుకోవాలన్నదే ఆ మంత్రి ప్లాన్‌గా తెలుస్తోంది. అయితే ఆ మంత్రి చేసున్న ఈ ప్రచారం ఆ నోట ఈ నోట గద్దేకి చేరడంతో తాను ఎట్టి పరిస్థితిలోనూ ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని… తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడుతున్నాని వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచే పోటీ చేసి గెలవడం ఖాయమని… ఆ మంత్రి ప్రచారానికి వ్యతిరేక ప్రచారం ప్రారంభించారట. ఏదేమైనా గద్దే సీటుకు ఎర్త్‌ పెట్టేలా ఆ మంత్రి వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఎలా మలుపులు తిరుగుతాయో ? దీన్ని గద్దే ఎలా తిప్పికొడతారో ? చూడాల్సిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*