టిడిపికి దడ పుట్టిస్తున్న నరసింహన్ …!

ఏపీలో కేంద్రానికి, రాష్ట్రానికి నడుమ యుద్ధానికి గవర్నర్ నరసింహన్ సూత్రధారా …? అవుననే అంటుంది టిడిపి. ఇప్పటివరకు డైరెక్ట్ గా గవర్నర్ పై మాట్లాడని చంద్రబాబు ఇక నోరు తెరిచారు. అసలు ఈ గవర్నర్ గిరీ ఉండకూడదని టిడిపి ఎప్పటినుంచో పోరాడుతుందని బాబు గుర్తు చేశారు. పత్రికల్లో గవర్నర్ పై వస్తున్న కధనాలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో అంటూ విరుచుకుపడ్డారు. ఇవి చాలు బాబుకి, గవర్నర్ నరసింహన్ కి బాగా గ్యాప్ పెరిగిపోయిందని చెప్పడానికి. తాజాగా తూర్పుగోదావరి పర్యటనలో ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమ సభ వేదిక పై నుంచే ఈ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు.

రెండు రోజులపాటు ఢిల్లీ లో గవర్నర్ …

గవర్నర్ రెండురోజులపాటు ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. ఆయన ఎపి సర్కార్ పై నిఘా ఫైల్ తో ఢిల్లీ చేరివుంటారని తమ్ముళ్లలో కలవరపాటు మొదలైంది. కర్ణాటక ఎన్నికల తరువాత చాలా చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని బిజెపి సీనియర్ నేత మురళీధర రావు వ్యాఖ్యానించడం, బిజెపి శాసనసభా నేత విష్ణుకుమార్ రాజు రోజు చేస్తున్న హెచ్చరికలు వెరసి ఎదో జరగబోతుందనే గుబులు టిడిపి వర్గాల్లో బయల్దేరింది. గవర్నర్ అకస్మాత్తుగా విజయవాడ వచ్చి సీఎం చంద్రబాబు తో చర్చించడం, ఆ తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధినేతతో భేటీ టిడిపి వర్గాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గవర్నర్ బాబు చర్చల్లో ఆయన సిఎం కు పలు సూచనలు హెచ్చరికలు చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక యుద్ధం ఆయనపై కూడానా …?

గవర్నర్ నరసింహన్ పై కూడా యుద్ధానికి దిగే యోచనలో పడింది టిడిపి. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి తదుపరి కార్యాచరణ చేపట్టాలని పసుపు దళపతి భావిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం గవర్నర్ దూకుడు కు ఎలా అడ్డుకట్ట వేయాలి అన్న ఆలోచనలో టిడిపి ఉందంటున్నారు. నరసింహన్ పై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగించాలని ఆయన ప్రతి కదలికను నిశీతంగా పరిశీలిస్తుంది సైకిల్ పార్టీ. కర్ణాటక ఎన్నికల తరువాత తమ పార్టీ పై జరిగే చర్యలను బట్టి రియాక్ట్ కావాలని టిడిపి అధిష్టానం యోచనలో వుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి ఏపీపై తన నివేదికను కేంద్రానికి పంపారు. గవర్నర్ నేరుగా ఢిల్లీ వెళ్ళి మరి నివేదిక ఇవ్వడంతో  టీడీపీలో అలజడి ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ నివేదికలు సమర్పించిన తర్వాత ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారుక. ఈ నేపథ్యంలో బాబు కూడా బిజెపి చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. చూడాలి వీరిద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*