రాజ్ భవన్ కేంద్రంగా ఇంత జరిగిందా?

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంత కాలం నుంచి చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వస్థ‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. రెండు రాష్ట్రాలుగా ఏపీ విడిపోయిన ద‌గ్గర నుంచి ఇరు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈఎస్ఎల్ న‌ర‌సింహం తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్ర‌బాబుతో ఆయ‌న భేటీ అనంత‌రం అనూహ్యంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. గ‌వ‌ర్న‌ర్ చుట్టూ ఎన్నో విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. భేటీ అనంత‌రం ఆయ‌న ఇచ్చిన నివేదిక‌లపై రాజ‌కీయ దుమారం రేగుతోంది. ఏపీకి, బాబుకు వ్య‌తిరేకంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు అధిక‌మ‌వుతున్నాయి. గ‌తంలోనూ ఇలాంటివి వినిపించినా.. ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. మ‌రి ఇంత‌లా గ‌వ‌ర్న‌ర్ ఏపీపై క‌క్ష సాధించ‌డానికి రీజ‌న్ ఏంటి? అంటే..

విభజన సమయంలోనూ…..

విభ‌జ‌న స‌మ‌యంలో ఉమ్మ‌డి ఏపీకి గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన న‌ర‌సింహ‌న్‌నే రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్రం నియ‌మించింది. రెండు రాష్ట్రాల‌పై అవ‌గాహ‌న ఉండ‌టంతో ఆయ‌న్నే కొన‌సాగిస్తూ వ‌చ్చింది. అయితే నాలుగేళ్లుగా ఆయ‌న తీరు ఏక‌ప‌క్షంగానే ఉంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. కీల‌కమైన ఆస్తులు, ఉద్యోగ‌స్తుల విభ‌జ‌న‌, 9, 10వ షెడ్యూల్‌లో అంశాలు, త‌దిత‌ర విష‌యాల్లో ఆయ‌న తెలంగాణ‌కే ల‌బ్ధి చేకూర్చేలా చేశారనే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. అయితే తాజాగా చంద్ర‌బాబుతో భేటీ అనంత‌రం ఆయ‌న ఇచ్చిన నివేదిక‌లు కూడా ఏపీకి, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని తేల‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీనిపై చంద్ర‌బాబు బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తంచేయ‌డం, మంత్రులు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

ఏపీ ప్రయోజనాలకు భిన్నంగా…..

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భిన్నంగా నరసింహన్ వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఏపీకి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారని, చంద్రబాబుపై దుర‌భిప్రాయం కలిగేలా కేంద్ర పెద్దలకు నివేదిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి కొంత వ్యతిరేకంగా నూరిపోశారని, ప్రాజెక్టు పనుల్లో అవతవకలు జరుగుతున్నట్లుగా ఇతరులెవరో ఇచ్చిన ఫిర్యాదులను అందజేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల గడ్కరీ రాష్ట్ర ప్రముఖుడొకరిని కలిసినప్పుడు నరసింహన్‌, చంద్రబాబు మధ్య విభేదాలున్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. పైకి ఇద్దరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, తాను సమతుల్యంతో వ్యవహరిస్తున్నానని నరసింహన్‌ చెబుతున్నా.. చంద్రబాబు పట్ల ఆయన వైఖరి భిన్నంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.

నివేదికలు అందించారా?

నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పటికీ నుంచీ గవర్నర్‌ అనేక అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. తాజాగా తమకు రాజకీయంగా నష్టం చేకూర్చేలా ఇతర పార్టీలను కలుపుతున్నారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. కేంద్రం కూడా పరిస్థితి సమీక్షించి గవర్నర్‌ మొదటి నుంచి ఏకపక్షంగా నివేదికలు అందిస్తున్నట్లు గమనించిందని ఢిల్లీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ ప్రధాని మోడీని తీవ్రమైన పదజాలంతో విమర్శించారని, ఈ విషయం మంచిది కాదని తాను స్వయంగా కలిసి చెప్పినప్పటికీ.. చంద్రబాబు లైట్‌గా తీసుకున్నారని గవర్నర్‌ ఓ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని ఆయన కలుసుకోలేకపోవడంతో నివేదికను వేరే వారికి అందజేసినట్లు సమాచారం.

1 Comment on రాజ్ భవన్ కేంద్రంగా ఇంత జరిగిందా?

  1. Andhra and Andhra media always poisonous against Telangaana. Schedule 9 and 10 assets always belongs to Telangana (how can permanent assets like building etc share with Andhra), this simple thing donot know after separation of 4years…………………… this mentality of andhras given anger to Tamils and send you out in 1951 from tamilnadu ……then you occupied innocent telangana and enjoyed for 60years

Leave a Reply

Your email address will not be published.


*