పార్టీ వీడరు…ఈగ వాలనివ్వరు…!!

ఏపీ బీజేపీలో ఓ కుదుపు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా కూడా బాధ్యతలు నిభాయించిన కామినేని శ్రీనివాస్ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేనా తాజాగా ఆయన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ని కలసి వచ్చారు. . నిజానికి కామినేని ఏనాడు బీజేపీ మనిషిగా వ్యవహరించలెదని అంటారు. ఆయన చంద్రబాబు భజనతోనే తన మంత్రి పదవీ కాలాన్ని పూర్తిగా గడిపేశారని సెటైర్లు పడ్డాయి అప్పట్లో. ఆరు నెలల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీ తరఫున పల్లెత్తు మాట మాట్లాడని కామినేని ఇలా అకస్మాత్తుగా బాబుని కలవడం వెనక ఆంతర్యాన్ని రాజకీయ పండితులు కనిపెట్టేశారు. ఆయన బీజేపీని తొందరలో వీడబోతున్నారని కూడా జోస్యం చెప్పేశారు.

ఎంతో మంది కామినేనిలు…

ఇక ఏపీ బీజేపీలో బయటపడిన కామినేని కాకుండా ఎంతో మంది ఉన్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీకి విశాఖలో చెప్పుకోదగిన బలం ఉంది. ఆ పార్టీ నుంచి ఇక్కడ ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ గెలిచారు. ఇందులో ఎమ్మెల్సీ తప్ప మిగిలిన ఇద్దరూ బాబు ని పెద్దగా తూర్పరా పట్టిన దఖాలాలు లేవు. అడపా దడపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాబుని కొంతైనా విమర్శించారు కానీ హరిబాబు నోటి నుంచి పన్నెతి మాటైనా రాలెదంటే బాబు పట్ల ఎంతటి అభిమానం గుండెల్లో ఉందోనని అంటారంతా
.

విష్ణు ఎటు వైపు…?

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిద్యం వహిస్తున్న విన్ష్ణు కుమార్ రాజు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది తెలియరాలేదు. ఆయన బాబుని ఏకంగా అసెంబ్లీలోనే ఓ స్థాయిలో పొగిడిన చరిత్ర ఉంది. అందాల నటుడు శోభన్ బాబులా ఆ రోజుల్లో ఉండేవారంటూ కీర్తించారు. బాబు పాలన భేష్ అని అనేకసార్లు మెచ్చుకున్న బీజేపీ నేత ఆయన. వీలైతే టీడీపీలోకి వెళ్ళి అయినా మరో మారు ఎమ్మెల్యే కావాలని విష్ణు అనుకుంటున్నారని ప్రచారమైతే ఉంది. మరి బాబు అనుమతి కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లుగానే ఉంది.

హరిబాబు రూటే వేరు….

హరిబాబు అయితే పార్టీని వీడే ప్రసక్తే లేదు. కానీ ఆయన బాబుని తిడుతూ పార్టీ బలోపేతానికి మాత్రం ముందుకు రారు. అసలు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నపుడే ఆయన పార్టీ పటిష్టత కోసం పెద్దగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నారు. ఈ రోజు ఆ పార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, రాం మాధవ్ వంటి వారు చేసే పదునైన విమర్శలు నాడే చేసి ఉంటే ఏపీలో బీజేపీ ఇంత కనాకష్టం అయ్యేది కాదన్నది అందరి మాట. కానీ ఆయన బాబు మీద ఈగ వాలనివ్వని నైజంతో ఉంటారాయే. అందువల్ల ఏపీ బీజేపీ ఈ మాజీ ప్రెసిడెంట్ గారిని కూడా నమ్ముకోరాదని తేలుతోంది. ఇక విశాఖ మిగిలింది ఎమ్మెల్సీ మాధవ్, ఆయన మాత్రమే రేపటి ఎన్నికల్లో బీజేపీ జెండా పట్టుకుని తిరిగేది అని డిసైడ్ అవుతున్నారు. మొత్తానికి మోడీ ప్రభ అలా మసకబారగానే నేతల రంగు ఇలా మారుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*