ఆ సీటు టీడీపీలో యమా హాటు..!

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాలు మహాకూటమి కట్టడం దాదాపు ఖ‌రారు కావడంతో తెలంగాణకు గుండెకాయలాంటి గ్రేటర్‌ హైదరాబాద్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఐ కొత్తగా పోటీ చేస్తున్న తెలంగాణ జనసమితి కూటమి కట్టి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంతో ఓట్ల చీలిక జరగకుండా విపక్షాలు లబ్ది పొంద‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామన్న ధీమాతో విపక్ష నాయకులు ఉన్నారు. ఇక సీమాంధ్రులు, సెటిల‌ర్ల ప్రభావమే ఎక్కువగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని అప్పుడే మహాకూటమిలోని వివిధ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతికి పోటెత్తుతున్న……

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. 2004 ఎన్నికల్లో తొలిసారి చంద్రబాబు ఓడిపోయాక 2005లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ మంచి విజయం సాధించింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గ్రేటర్‌ పరిధిలో ఏకంగా 15 సీట్లలో పాగా వేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండడంతో గ్రేటర్‌లోని పలు సీట్లు నుంచి పోటీ చేసేందుకు టీడీపీ ఆశావాహులు అమరావతికి పోటెత్తుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో సీట్లు ఇవ్వాలని వాళ్లు చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. గతంలో సీట్లు రాకపోయినా నగరంలో పలు నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు పలువురు సీనియర్‌ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేయడంతో అందివచ్చిన అవకాశం కోసం వారంతా టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కూకటపల్లి సేఫ్ అని……

టోటల్‌గా తెలంగాణలో టీడీపీ 15 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ అంతకుమించి టీడీపీకి సీట్లు ఇచ్చేందుకు సుముఖ‌త వ్యక్తం చెయ్యకపోవచ్చని అంటున్నారు. ఈ 15 సీట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి టీడీపీకి అత్యంత సురక్షితమైన సీటు కావడంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీలో పలువురు సీనియర్లు కూడా ట్రై చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి ఇప్పుడు టీడీపీలో యమా హాట్‌ సీటుగా మారిపోయింది. గత ఎన్నికల్లో ఈ సీటు కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. అయితే చంద్రబాబు స్థానికుడైన మాధవరం కృష్ణారావుకు ఇచ్చారు. టీడీపీ ఇక్కడ మంచి మెజార్టీతో విజయం సాధించింది. ఇక్కడ వచ్చిన మెజార్టితోనే మల్కాజ్‌గిరి ఎంపీ సీటును సైతం టీడీపీ గెలుచుకునేందుకు యూజ్‌ అయ్యింది.

రేణుక కూడా ఇక్కడి నుంచే…..

మాధవరం కృష్ణారావు పార్టీ మారిపోవడంతో ఇప్పుడు పలువురు స్థానిక నేతలతో పాటు తెలంగాణలో కొసరు కొసరుగా మిగిలిన టీడీపీ సీనియర్లు సైతం ఇదే సీటుపై కన్నేశారు. టీడీపీ నుంచి విజయం సాధించేందుకు కూకట్‌పల్లికి మించిన సురక్షితమైన సీటు మరొకటి లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరో ట్విస్ట్‌ ఏమిటంటే ఇక్కడ ఎవరు పోటీ చేసిన విజయం సాధించే ఛాన్సులు ఉండడంతో కాంగ్రెస్‌ సైతం ఇదే సీటుపై కన్నేసింది. రేణుకా చౌద‌రి లాంటి సీనియర్లు కూకట్‌పల్లిపై ఆశక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఇనుగాల‌పెద్దిరెడ్డి సైతం ఇప్పుడు కూకట్‌పల్లి సీటును దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

తనకే ఇవ్వాలంటూ….

పార్టీలో చాలా మంది సీనియర్లు వెళ్లిపోయినా తాను మాత్రం మిమ్మల్నే నమ్ముకుని ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో కూకట్‌పల్లి సీటు తనకే ఇవ్వాలని ఆయన చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలుసింది. కూకట్‌పల్లికి పెద్దిరెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదు. అయితే తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌ కంటే కూకట్‌పల్లే సేఫ్‌ అన్న భావనలో ఆయన ఇక్కడ కన్నేసినట్టు తెలిసింది. అయితే మహాకూటమిలో పోటీ చేసేందుకు ఇతర పార్టీలైన‌ కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ జనసమితి నేతలు సైతం ఇదే సీటుపై కన్నెయ్యడంతో అసలు ఫైన‌ల్‌గా ఈ సీటు కూటమిలో భాగంగా ఏ పార్టీకి వస్తుంది, ఫైన‌ల్‌గా ఎవరు ఇక్క‌డ క్యాండెట్‌గా బ‌రిలో ఉంటారో చూడాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకోవడంతో టీడీపీకే ఈ సీటు కేటాయిస్తారని ప్రాధ‌మికంగా తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*