వావ్….ఏం సిటీ…?

హైద్రాబాద్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. అది మౌలిక వసతుల విషయంలో కాదు. సంస్కృతి ని మార్చుకోవడంలో విశ్వనగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. పబ్ కల్చర్, డ్రగ్స్, వుమెన్ ట్రాఫికింగ్, రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు నైట్ రైడింగ్స్, కుర్ర కారు రేసులు, తాగుబోతుల డ్రంక్ అండ్ డ్రైవ్ లు బెట్టింగ్ లు ఇలా ఒకటేమిటి మహానగరాలకు ఏ మాత్రం ఇక్కడ తీసిపోవడం లేదు. అన్ని సరదాలు సికింద్రాబాద్ కేనా అనుకున్నారో ఏమో పాత బస్తీలో ఫారిన్ భోగం మేళం పెట్టేశారు కొందరు. ఒక నేతకు చెందిన వివాహ వేడుకల్లో బెల్లి డ్యాన్స్ బృందాన్ని పబ్లిక్ గా పెట్టి మస్తు మస్తు గా ఎంజాయ్ చేశారు.

కొంప ముంచిన సోషల్ మీడియా …

సోషల్ మీడియా విస్తృతం అయ్యాక చీకటి బాగోతాలు రోజు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. అలాగే పాతబస్తీ చంద్రనారాయణ గుట్ట లో జరిగిన ఈ కోలాటం వీడియో లు ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేయడంతో చేసేదిలేక పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత రాజకీయ అండదండలు వున్న బడా బాబు కుమారుడి పెళ్ళి లో జరుగుతున్న బాగోతం అని తెలిసినా మనకెందుకులే అని పోలీసులు సైలెంట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో విదేశీ భామల ర్యాక్ పై అర్ధనగ్న నృత్యాలు చూసి జనం ఛీ అనకముందే ఖాకీలు కేసు పెట్టేశారు.

వెరైటీ కోసం 15 లక్షలకు డీల్ …

తన వివాహం వెరైటీగా వుండాలని దుబాయిలో బాగా డబ్బు సంపాదించి పెళ్ళాడుతున్న వరుడు ఈ ఎంటర్ టైన్మెంట్ అతిధులకు కానుకగా అందించాలనుకున్నాడు. విదేశాలనుంచి కొందరు, ముంబాయి నుంచి మరికొందరు ఈ బెల్లి డ్యాన్స్ కి విచ్చేశారు. అందుకోసం జూబ్లీహిల్స్ లో చిత్ర పరిశ్రమలో పనిచేసే వెంకట్ తో 15 లక్షల రూపాయలు ఈవెంట్ కోసం వెచ్చించాడు వరుడు. ఇంకేం అదరహో అంటూ గానా బజానా షురూ చేశారు. నోట్లను వెదజల్లుతూ హుషారైన వారు డ్యాన్సింగ్ భామల చుట్టూ చక్కెర్లు కొట్టారు. వచ్చిన వారంతా నోరెళ్ళబెట్టి అందాల భామల కళానైపుణ్యం తనివితీరా ఆస్వాదించారు. కానీ చివరికి సీన్ ఇప్పుడు పోలీస్ కేసు దాకా పోయింది. అయితే బడాబాబులు కావడంతో పోలీసులు కూడా మరీ పెద్ద కేసు ఏమి పెట్టకపోవడం కొసమెరుపు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*