ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు..? ఇండియా టుడే సర్వేలో తేలిందిదే..!

ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కావాలని ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారని ఇండియా టుడే గ్రూప్ – యాక్సిస్ మై ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో జగన్ ముఖ్యమంత్రి కావాలని 43 శాతం మంది ఆశించగా, 38 శాతం మంది చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, 5 శాతం మంది పవన్ కళ్యాణ్ కావాలని అనుకుంటున్నారని తేలింది.
– ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనపై 33 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 36 శాతం మంది బాగాలేదని, 18 శాతం మంది చెప్పలేమని తేల్చారు.
– 2019లో కాబోయే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ వైపు 44 శాతం మంది మొగ్గు చూపగా, నరేంద్ర మోదీ వైపు 38 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు.
– కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 31 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 42 మంది బాగాలేదని, 23 శాతం మంది చెప్పలేమని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*