వారికి నో టిక్కెట్ అట….!

ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో తెలంగాణాలో టి కాంగ్రెస్ దూకుడు పెంచింది. 119 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిపోయారు. ఎవరి బాధ్యతలు ఏంటన్నది సమావేశంలో డిసైడ్ చేసేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలా ఎదుర్కొవాలన్నదానిపై వారికి దిశా నిర్దేశం చేసేసారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్ని ? పోటా పోటీ గా వున్న స్థానాలు ఎన్ని ? క్లిష్టమైన స్థానాలు ఎన్ని ? ఓడిపోయే స్థానాలు ఏవి ? అనే లెక్కలు వేసేశారు ఉత్తమకుమార్ రెడ్డి.

రంగంలోకి కార్యదర్శులు …

అసెంబ్లీ నియోజకవర్గాల పనితీరు పరిశీలించేందుకు కార్యదర్శులు పర్యటన ఈ తొలి వారంలోనే మొదలు పెట్టేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టి కాంగ్రెస్ బాస్ వారికి ఆదేశాలు ఇచ్చేశారు. ఎవరెవరు ఏ పనులు చేయాలో ఆయన దిశా నిర్దేశం చేశారు. గెలిచేందుకు అనుసరించాలిసిన వ్యూహాలను ఇన్ ఛార్జ్ లకు తెలియచేశారు.

వారికి టికెట్లు ఇవ్వకండి …

గత ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీ తో ఓటమి పాలయిన అభ్యర్థులకు తిరిగి టికెట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఇంచార్జ్ లు ఉత్తమకుమార్ రెడ్డికి విన్నవించుకున్నారు. సునాయాసంగా గెలిచే అభ్యర్థులను గుర్తించి వారికి ముందే టికెట్లు కేటాయిస్తూ ప్రకటిస్తే మరింత ప్రయోజనం కాంగ్రెస్ కి లభిస్తుందని కొందరు సూచించారు. కష్టపడితే గెలిచే నియోజకవర్గాలను గుర్తించాలని అధ్యక్షుడికి సూచించారు. ఓటమి చెందే అవకాశాలు ఉన్నవాటిని గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే కీలకమైన ఈ భేటీలో అత్యధికులు హాజరుకాకుండా డుమ్మా కొట్టడం కాంగ్రెస్ నేతలను కలవరపరిచింది. అయితే వారంతా అధ్యక్షుడి అనుమతితోనే సమావేశానికి హాజరు కాలేదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*