రచ్చ కొనసాగుతూనే వుంది …!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల వ్యవహారం హస్తం పార్టీకి తలపోటుగా మారింది. తమకు రాష్ట్ర పార్టీ అండదండలు ఏవంటూ సంపత్ తాజా మరోసారి టి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డిలను ఏకేసారు. పార్టీ లోని ఎమ్యెల్యేలకే న్యాయం చేయలేకపోతే సామాన్యులకు ఏమి చేస్తారన్న భరోసా ఇవ్వగలం అంటూ నోటికి పని చెప్పారు సంపత్. తాజాగా పిసిసి చీఫ్, శాసనసభ పక్ష నేతలతో సమావేశం అయిన సందర్భంగా సంపత్ రాష్ట్ర రధసారధులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఒకలా వేధిస్తుంటే సొంత పార్టీ మరోలా వేధిస్తుందంటూ దుమ్ము దులిపేశారు.

ఇంకా ఏం చేయాలన్న పెద్దలు …

శాసన సభ్యుల సభ్యత్వాల రద్దు రాహుల్ దృష్టికి తెచ్చాం. న్యాయపోరాటానికి సహకరిస్తున్నాం. అనేక వేదికలపై ఈ అధర్మాన్ని ఖండిస్తున్నాం. హై కోర్టు లో పోరాటం పార్టీనే కదా చేసింది. పార్టీ అధినేత ఖండించేలా చర్యలు చేపట్టింది ఎవరు ? ఇంత చేసినా ఏమి చేయలేదంటారే అని నిలదీశారు కాంగ్రెస్ పెద్ద జానారెడ్డి. అయినా ఈ చర్యలు సరిపోవంటే ఏం చేయమంటారని ప్రశ్నలు సంధించారు ఉత్తమ్. మూకుమ్ముడిగా గన్ మెన్లు వెనక్కి ఇవ్వాలన్నారు దీనిపై సంపత్. ఈ అంశాన్ని ఎక్కువమంది అంగీకరించలేదు. అంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న డిమాండ్ పైనా కాంగీయులు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*