కాంగ్రెస్ ను వణికిస్తున్న …!!

నేను, మా ఆవిడ, లేదా నేను నా కొడుకో కూతురో అంటూ ఫ్యామిలీ ప్యాక్ డిమాండ్ చేస్తూ అధిష్టానానికి తలపోటు తెస్తున్నారు టి కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఒక టికెట్ కె దిక్కులేదని కష్టపడిన పార్టీ ని నమ్ముకున్నవారు నెత్తినోరుకొట్టుకుంటూ ఒక పక్కన ఉన్నారు. వారి ఎదుటే తమ సీనియారిటీని, ఆర్ధిక స్థోమతను అడ్డుపెట్టుకుని అధిష్టానం ముందు క్యూ కడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఈనెల 18 న తొలి జాబితాను ప్రకటించాలని అనుకున్న టి కాంగ్రెస్ జాబితాకు సీనియర్ల ఫ్యామిలీ ప్యాక్ లు అడ్డుగా నిలవడంతో అభ్యర్థుల జాబితా ఈ నెలాఖరుకు మారిపోయింది అంటున్నాయి పార్టీ వర్గాలు. దీన్ని మజాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న టిఆర్ఎస్ మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి అయ్యేటప్పటికి తాము స్వీట్లు పంచేసుకుంటామని ఎద్దేవా చేస్తుంది అంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ టికెట్ల కుస్తీ సాగుతుందో చెప్పక చెప్పేయొచ్చు.

ఫ్యామిలీ ప్యాక్ కోరుతున్నది వీరే …

టి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన టికెట్ తో బాటు కొడుక్కి మరో సీటు డిమాండ్ చేస్తున్నారు. ఆయన బాటలోనే డికె అరుణ తన కుమార్తె సిగ్దనకు మక్కల్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తన మాట కాదని టీఆరెస్ లోకి వెళ్లిన తమ బంధువు కు చుక్కలు చూపించాలంటే తమ కుటుంబం నుంచే ఎవరో ఒకరు బరిలోకి దిగాలన్నది డికె వాదన. ఇక ముఖేష్ గౌడ్ తన కుమారుడు విక్రమ్ గౌడ్ కి అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కి దామోదరం రాజనర్సింహయ్య తన భార్య పద్మినిరెడ్డికి, గీతారెడ్డి, సునీతా లక్ష్మ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి ఇలా అంతా తమకు వన్ ప్లస్ వన్ స్కీం అమలు చేయాలని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

ఒక ఫ్యామిలీకి ఒకటే అంటూ …

ఇలా ఇచ్చుకుంటూ పోతే బయటివారికి ఇచ్చేందుకు టికెట్లు ఏమీ ఉండవని పరిస్థితి తీవ్రత గమనించిన కాంగ్రెస్ అధిష్టానం నేతలకు క్లారిటీ ఇచ్చేసింది. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి గ్యారంటీ ఎవరికీ కావాలో తేల్చుకోవాలని సూచించింది. ఇది ఇప్పుడు సీనియర్లకు మింగుడు పడని పరిస్థితి గా మారింది. ఇందులో రెండు కుటుంబాలకు మాత్రం సిట్టింగ్స్ గా వారు కొనసాగుతున్న నేపథ్యంలో మినహాయింపు ను కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తుంది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ఆయన భార్య , కోమటి రెడ్డి బ్రదర్స్ కి ఈ రూల్ నుంచి తప్పించారని అంటున్నారు. టి కాంగ్రెస్ నేతల తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ది ఫక్తు కుటుంబ పాలనగా సభలు సమావేశాల్లో ఇంటా బయటా ఉపన్యాసాలు దంచేవారంతా తమ దాకా వచ్చేటప్పటికి తమ కుటుంబ పాలనకు దారి వెతుక్కునే ప్రయత్నంలో ఉండటంతో ఔరా ఎన్నికల సిత్రాలు అని నవ్వుకుంటున్నారు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 813 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

1 Comment on కాంగ్రెస్ ను వణికిస్తున్న …!!

  1. hello sir all political leaders have families all political party leaders definitely gives important to their families..dont make this news as issue try to recognise who is the best leader and through which party people will get benifits..and which party will protect india from correption..

Leave a Reply

Your email address will not be published.


*