వైఎస్ ఫార్ములా కావాలి….!

another ys rajasekharreddy wanted

కాంగ్రెస్ పార్టీకి బలం… బలహీనత ఆ పార్టీలోని వారే. క్యాడర్ కన్నా లీడర్ లు అధికంగా వుండే కాంగ్రెస్ లో టికెట్ల పంపిణి సమయంలో జరిగే యుద్ధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రజల్లో గాలి అనుకూలంగా వున్న సమయంలో కూడా దాన్ని తమకు అనుకూలంగా మల్చుకోలేక విఫలమౌతుంది హస్తం పార్టీ. ఈ పరిస్థితిని మార్చాలన్నది టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి వ్యూహం. అందుకే ఢిల్లీ వెళ్ళి మరి సీడబ్ల్యూసీ సమావేశంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ యుపిఎ చైర్ పర్సన్ సోనియా ముందు కుండబద్దలు కొట్టేశారు.

అలా చేయకపోతే కష్టం …

ఉత్తమకుమార్ అధిష్టానం కి చెప్పింది ఇదే . ఎన్నికలకు ముందుగానే టికెట్లు ప్రకటించండి. దానివల్ల ప్రజలతో మమేకం అయ్యేందుకు నేతలకు మరింత సమయం చిక్కుతుంది. ఎన్నికల మ్యానిపెస్టో ఇప్పుడే ప్రకటించండి. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమయం లభిస్తుంది అని టి పిసిసి తన గోడు వెళ్లబోసుకుంది.

గతంలో వైఎస్ కూడా…..

గతంలో వైఎస్ 2009 ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో 294 అసెంబ్లీ సీట్లకు నాలుగు తప్ప 290 సీట్లను ఎన్నికలకు బాగా ముందే ప్రకటించి విజయం అందుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను టిపిసిసి కోరుకుంటుంది. టి సర్కార్ పై వ్యతిరేకంగా జనం వున్నారని దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వచ్చే ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఇప్పటినుంచి కసరత్తులు మొదలు పెట్టింది కాణగ్రెస్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*