టీడీపీలో చిచ్చు.. రీజ‌న్ ఏంటి..?

internal war in telugudesam party

ప్ర‌కాశం జిల్లా మార్కాపురం టీడీపీ రాజ‌కీయాలు నివురు గ‌ప్పిన నిప్పులా ర‌గులుతున్నాయి. నాయ‌కుల‌ను మార్చే ల‌క్ష‌ణం ఉన్న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బ‌లమైన నాయ‌కుల కోసం పోటీ కూడా పెరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జంకే వెంక‌ట‌రెడ్డి 9 వేల పైచిలుకు ఓట్ల‌తో విజ‌యం సాధించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ జంకేను ప‌క్క‌న పెడుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడిని వెతికే ప‌నిలోనాయ‌కులు ఉన్నారు. దీంతో టీడీపీ కూడా ఇదే దిశ‌గా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన కందుల నారాయ‌ణ రెడ్డిని ప‌క్క‌న పెడ‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఆయనకే ఇవ్వాలని….

అదేస‌మ‌యంలో టీటీడీ బోర్డు సభ్యుడు ఇన్ఫోటెక్‌కు చెందిన బోధనపు అశోక్‌రెడ్డి పేరు టీడీపీ అభ్య‌ర్థిగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అశోక్‌రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ మేరకు టీడీపీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందన్న ప్రచారం ఉంది. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కందుల నారాయణరెడ్డిని ఒప్పించి అశోక్‌రెడ్డిని రాబోయే ఎన్నికల బరిలో నిలిపేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కొంత కాలంగా ఈ ప్రచారం ఉన్నా అశోక్‌రెడ్డి పూర్తి స్థాయిలో బయట పడలేదు. కానీ, తాజాగా అశోక్‌రెడ్డి స్వ‌యంగా తెర‌మీదికి వ‌చ్చారు. మార్కాపురం టికెట్‌ బరిలో తానున్నాంటూ ప్రకటించి ఆ పార్టీలో మరింత ఆజ్యం పోశారు. జరుగుతున్న తంతు చూస్తే కందులను తప్పించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తాము మద్దతివ్వబోమని…

అయితే కందుల వర్గం దీన్ని ఖండిస్తోంది. ఒక వేళ నారాయణరెడ్డిని కాదని ఇన్ఫోటెక్‌ అశోక్‌రెడ్డిని అభ్యర్థిగా నిలిపే పక్షంలో తాము వారికి మద్దతు ఇచ్చేది లేదని ఆయన వర్గం తేల్చి చెబుతోంది. కాదు కూడదని చంద్రబాబు అశోక్‌రెడ్డిని బరిలో నిలిపితే తాము పార్టీని వీడేందుకు సిద్దమని వారు తేల్చి చెబుతున్నారు. వాస్త‌వానికి కందుల నారాయ‌ణ రెడ్డి టీడీపీలో చాలా సీనియ‌ర్. ఈయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇవ్వ‌కుండా చేసేందుకు లేదా తిర‌స్క‌రించేందుకు పెద్ద‌గా కార‌ణాలు కూడా క‌నిపించ‌డం లేదు. కానీ, కందుల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఇమ్మ‌డి కాశీనాథ్ మాత్రం కందుల‌కు టికెట్ ఇవ్వొద్ద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఏ వ‌ర్గం ఆగ్ర‌హిస్తే.. ఏమ‌వుతుందోననే భ‌యంతోనే ఇక్క‌డ అభ్య‌ర్థిని మారుస్తామంటూ అధిష్టానం నుంచి త‌మ‌కు క‌బురు అందింద‌న్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.కందుల గ‌త మూడు ఎన్నిక‌ల్లో పోటీ చేసి కేవ‌లం 2009లో మాత్ర‌మే ఇక్క‌డ గెలిచారు. ఇక అదే స‌మ‌యంలో మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు త‌న‌యుడు శిద్ధా సుథీర్‌బాబు పేరు కూడా ఇక్క‌డ వినిపిస్తోంది. సుధీర్‌బాబు ఇక్క‌డ పోటీ చేయాల్సి వ‌స్తే ఎన్నిక‌ల వేళ బాబు ఇష్టాఇష్టాలు, స‌మీక‌ర‌ణ‌లు కూడా కీల‌కం అవుతాయి. మ‌రి మ‌రో ప‌ది, ప‌దిహేను రోజులు ఆగితే.. ఇక్క‌డ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*