జ‌మీందారుల కోట‌లో జ‌గ‌న్ బ‌లం ఎంత‌…!

కృష్ణాజిల్లాలో కీల‌క‌మైన నూజివీడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రోసారి త‌న ఖాతాలో వేసుకునేందుకు జ‌గ‌న్ పెద్దగా ప్ర‌య‌త్నాలు చేయాల్సిన అవ‌స‌రం లేదా ? అంటే అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం అవును అన్న‌ట్టుగానే ఉంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన‌ మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు ఉన్నారు. స్థానికంగా ఈయ‌నకు మంచి ఫాలోయింగ్ ఉండడం గ‌మ‌నార్హం. జ‌మీందారుల వంశానికి చెందిన ప్ర‌తాప్ అప్పారావు 2004లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున భారీ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్‌కు అనుచరుడుగా గుర్తింపు పొందిన ఆయ‌న కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ స్థాపించిన పార్టీలో చేరి.. 2014లో మ‌రోసారి నూజివీడు నుంచి గెలు పొందారు. అయితే, ఇక్క‌డ ఆయ‌న‌పై పోటీ చేసిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు.. కొద్దిపాటి తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

టీడీపీలో వర్గ విభేదాలు…..

ఇక‌, వ‌చ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి బ‌ల‌మైన నేత పోటీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ముద్ద‌ర బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావుకు వ్య‌తిరేకంగా సొంత పార్టీలోనే వ‌ర్గపోరు ఎక్కువ‌గా న‌డుస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ మాకంటే మాకంటూ టీడీపీ నేత‌లు త‌న్నుకుంటున్నారు. దీంతో వైసీపీకి లైన్ క్లియ‌ర్ అవుతోంది. దీనికితోడు మేకా కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు చేర‌వ‌య్యేందుకు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తాగునీటికి ఇంటింటికీ అందిం చేందుకు ఆయ‌న త‌న సొంత నిధుల‌ను ఖ‌ర్చు చేశారు. అదేవిధంగా సౌమ్యుడు అనే పేరుకూడా ఈ ఎమ్మెల్యే సొంతం చేసుకున్నారు. స్థానికంగా టీడీపీ నేత‌లు అనుస‌రిస్తున్న వైఖ‌రితో విసిగిపోయిన ప్ర‌జ‌లు వైసీపీకి అనుకూలంగా మారారు. 2004-2009 మ‌ధ్య నియోజ‌కర్గ చ‌రిత్ర‌లోనే జ‌ర‌గ‌ని అభివృద్ధిని మేకా చేప‌ట్టారు. ఇది ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది.

పాదయాత్ర ప్లస్ అవుతుందని…..

ఈ ప‌రిణామాల‌కు తోడు జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర కూడా వైసీపీకి ప్ల‌స్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. అదేవిధంగా స్థానిక రైతాంగం రుణాల విష‌యంలో బ్యాంకులు అనుస‌రిస్తున్న తీరుపై మేకా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి రైతుల‌కు అనుకూలంగా ఒక రోజు దీక్ష కూడా చేశారు. దీంతో బ్యాంకులు దిగొచ్చి.. రైతుల‌కు రుణాలు ఇస్తున్నాయి. ఇది మేకాకు ప్ల‌స్‌గా మారింది. ఇక‌, స్థానికంగా వైసీపీ కేడ‌ర్ అంతా వ‌ర్గాల‌కు అతీతంగా ఆయ‌న‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తుండ‌డం మేకాకు క‌లిసివ‌స్తున్న అంశం. గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లా అంత‌టా టీడీపీ గాలి వీచినా నూజివీడులో మాత్రం మేకా విజ‌యం సాధించారు. సుదీర్ఘ‌కాలంగా వీరి ఫ్యామిలీకి నియోజ‌క‌వ‌ర్గంతో, ప్ర‌జ‌ల‌తో అనుబంధం ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసి రానుంది.

వ్యక్తిగత ఇమేజ్ తో……

1999లో టీడీపీ టిక్కెట్ ఆశించిన మేకా టిక్కెట్ రాక‌పోవ‌డంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచి స‌త్తా చాటారు. నాడు కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన మాజీ మంత్రి పాల‌డుగు వెంక‌ట్రావు మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఆయ‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ఇమేజ్ చూసే 2004లో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చారు వైఎస్‌. మేకా సంగ‌తి ఇలా ఉంటే టీడీపీలో ముద్ద‌ర‌బోయిన వ‌ర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ‌ర్గీయుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం లేదు. ఒక‌రిమీద ఒక‌రు స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబే వీరి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌లేక‌పోయారు. ఇవ‌న్నీ కూడా వైసీపీకి ప్ల‌స్ కానున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*