బాబు భయపడుతుంది అందుకే…!

ప్రత్యేక హోదాపై వైసీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఒక వైపు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తుంటే వారికి సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎంపీలకు మద్దతుగా నిలిచారు. అలాగే వంటావార్పు కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేశారు. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ నినాదాలు చేశారు. కంచికచర్లలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది.

హోదా ఉద్యమం తీవ్రతరం….

నెల్లూరు జిల్లాలో కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. లారీ డ్రైవర్లకు, సిబ్బందికి వైసీపీ అన్నదానం చేసింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. నలభై ఏళ్ల అనుభవం ఉందంటున్న చంద్రబాబు ఆ అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికే వినియోగిస్తున్నాడన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను చంద్రబాబు నిలువునా ముంచాడని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఇంత మోసం ఎక్కడా….

చంద్రబాబుకు ఈ మధ్య భయం మొదలయిందన్నారు జగన్. అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి ఎక్కడ బయటకొస్తుందోనన్న కంగారు బయలుదేరిందని, అందుకోసమే ఆయన అందుకే ముందుగానే ఆయన కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. 25 మంది ఎంపీలు ఒక్కసారి రాజనామా చేస్తే జాతీయ స్థాయిలో చర్చ జరిగేదన్నారు. రాజీనామాలు చేసేందుకు కేసుల భయమే చంద్రబాబును వెంటాడుతుందన్నారు. నాలుగేళ్లుగా తాను చేసిన అవినీతి పనులపై చర్చ జరిగితే వాదించడానికి ఎంపీలు అవసరమని నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. ఇలాంటి మోసాల చంద్రబాబును ప్రజలు నమ్మకుండా బుద్ధి చెప్పాలని జగన్ పిలుపు నిచ్చారు.