బ్రేకింగ్ : బాబుకు జగన్ ఏడు సూటి ప్రశ్నలు

ysjaganmohanreddy vs pawan kalyan

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైసీపీ పోరాటం చేస్తుందని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి రమ్మని పిలుస్తూ తనకు పంపిన ఆ లేఖలో తన ఢిల్లీ పర్యటన గురించి అన్ని పార్టీలకూ వివరిస్తానని చెప్పారు. హేమమాలినితో ఏం మాట్లాడిందీ తమకు సమావేశంలో చెబుతారా? అని జగన్ ఎద్దేవా చేశారు.

అఖిలపక్షానికి ఎందుకు వెళ్లాలి……?

ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏంచేశారని అఖిలపక్షానికి వెళ్లాలని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్లను అక్కడి నేతలు నమ్మరని అన్నారు జగన్. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళితే ఆయనను కలిసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, చిన్నా చితకా నేతలే కలిశారని జగన్ అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తిని ఎవరు నమ్ముతారన్నారు.అఖిలపక్షం పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందేమోనని భయం, అనుమానంతో తన ఎంపీల చేత రాజీనామా చేయించలేదని జగన్ తెలిపారు. విచారణకు ఆదేశిస్తే పార్లమెంటులో గొడవ చేయడానికే ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా ప్రత్యేక హోదాను మరోసారి తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఆ ఏడు ప్రశ్నలివే……

చంద్రబాబు తన స్వార్థం కోసం ఏదైనా చేసే వ్యక్తి అని జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను మోసం చేసిన తర్వాత కూడా చంద్రబాబు ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం దారుణమన్నారు. హోదా కోసం ఆఖిరి అస్త్రంగానే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. చంద్రబాబుకు ఏడు ప్రశ్నలు వేస్తున్నాననన్నారు. 1. మార్చి 2. 2014న రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించి ప్లానింగ్ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ అమలులో ఉంది. అయితే ఈ ఏడు నెలలు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేక పోయారు. వారిని ఎందుకు కలవలేదు. ఏడు నెలలు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? 2. సెప్టంబరు 8 2016 అర్ధరాత్రి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని అరుణ్ జైట్లీ ప్రకటించినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు. చంద్రబాబు కోరిక మేరకే తాము ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వాస్తవమా? కాదా? అరుణ్ జైట్లీని ప్రశంసించలేదా? ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అన్నది వాస్తవం కాదా? కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా? అనలేదా? 3. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టకుండా ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని చంద్రబాబు బయట ప్రపంచానికి కలర్ ఇవ్వలేదా? 20 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షలు మందికి ఉద్యోగాలు వచ్చాయన్నది నిజం కాదా? 4. ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటం చేసినా దగ్గరుండి దాన్ని విఫలం చేసిన చరిత్ర చంద్రబాబుది కాదా? ఏడు రోజుల పాటు ప్రత్యేక హోదా కోసం తాను ఏడు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగితే మోడీ వస్తున్నారని చెప్పి దాన్ని భగ్నం చేయలేదా? 5. వైసీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టి ఉండకపోతే మీరు అవిశ్వాసం పెట్టేవారా? తమ అవిశ్వాసానికి మద్దతిస్తామని చెప్పి మళ్లీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? 6. అఖిలపక్షం అని చెప్పి డ్రామాలు వాస్తవం కాదా? మొదటి అఖిలపక్షంలో గజదొంగ ఒకడు దోపిడీకి సలహాలు ఇవ్వమన్నట్లుంది. నల్లబ్యాడ్జీలు ధరించి ఆఫీసులకు వెళితే ప్రత్యేక హోదా వస్తుందా? ఉద్యమాన్ని నీరుగారుస్తుంది నిజం కాదా? అఖిలపక్షం ముసుగులో మరోసారి అన్యాయం చేయడం నిజం కాదా? 7. ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని తెలిసి…ఆఖరి బడ్జెట్ సమావేశం అని తెలిసి ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఎందుకు ఆమరణదీక్షకు దించలేదు? అని జగన్ ఏడు ప్రశ్నలను చంద్రబాబుకు సంధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*