జ‌గ‌న్ అక్క‌డ వేస్తోంది…. రైటా… రాంగా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర మ‌రో 10 రోజుల్లో పూర్త‌వుతుంది. జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఒక్క సీటు గెల‌వ‌ని జిల్లా ఇదే. నాలుగేళ్ల త‌ర్వాత ఇక్క‌డ బాబు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉండ‌డంతో జ‌గ‌న్ యాత్ర‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. అయితే దీనిని క్యాష్ చేసుకునే విష‌యంలో జ‌గ‌న్ నూటికి నూరు శాతం స‌క్సెస్ అవుతున్నాడా ?

కోట‌గిరి ఎంపిక క‌రెక్టేనా..?

జ‌గ‌న్ ఈ జిల్లాలో బాగా క‌ష్ట‌ప‌డినా, స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నా క్యాండెట్ల ఎంపిక‌లో జ‌గ‌న్ చాయిస్ క‌రెక్టుగా ఉందా ? అంటే వేచి చూడాల్సి ఉంది. ఏలూరు ఎంపీ సీటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌ను నియ‌మించారు. ఈ సీటును ఎప్పుడూ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గ‌మే గెలుస్తూ వ‌స్తోంది. ఏ పార్టీ అయినా వీళ్ల‌నే రంగంలోకి దింపుతున్నారు. జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో వీళ్ల‌ను ప‌క్క‌న పెట్టేసి మ‌రో ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గంకు చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్‌ను రంగంలోకి దింప‌గా ఆయ‌న ఓడిపోయారు.

బ‌ల‌మైన అభ్య‌ర్థుల కొర‌త‌…

ఇక ఏలూరు అసెంబ్లీ సీటు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ మ‌ధ్యాహ్న‌పు ఈశ్వ‌రీ బ‌ల‌రాంను నియ‌మించారు. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అయితేనే బ‌ల‌మైన క్యాండెట్‌. చింత‌ల‌పూడిలో ఎక్క‌డా లేని విధంగా న‌లుగురు క‌న్వీన‌ర్లు మారారు. ప్ర‌స్తుతం ఉన్న ఎలీజాను కూడా ఉంటారా ? మార‌తారా ? అన్న‌ది డౌటే. గోపాల‌పురం, కొవ్వూరులో కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేరు. నిడ‌ద‌వోలులోనూ అదే ప‌రిస్థితి.

న‌మ్మ‌క‌స్థుల‌నూ మార్చే అవ‌కాశం…

త‌ణుకులో మాజీ ఎమ్మెల్యే కారుమూరి రంగంలో ఉన్నా ఇక్క‌డ కూడా గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన వంక ర‌వీంద్ర లేదా ఆయ‌న స‌తీమ‌ణి రాజ‌కుమారి అయినా పోటీ చేయ‌వ‌చ్చంటున్నారు. ఇక జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడిగా ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా వ‌దులుకున్న ముదునూరి ప్ర‌సాద‌రాజును సైతం న‌ర‌సాపురంలో మార్చ‌వ‌చ్చ‌ని… ఇక్క‌డ మ‌రో వ్య‌క్తి పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది.

అధికారిని బ‌రిలో దింపే యోచనలో….

తాడేప‌ల్లిగూడెంలో ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేరు వినిపిస్తున్నా ఆయ‌న్ను మార్చి ఓ ఉన్న‌త అధికారిని పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ ప్లాన్‌. ఏదేమైనా జ‌గ‌న్ అభ్య‌ర్థుల విష‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో వేసిన రాంగ్ స్టెప్పులే ఇప్పుడు మ‌ళ్లీ వేస్తే వైసీపీకి వేవ్ ఉన్నా పెద్ద మైన‌స్ అయ్యే ప్రమాదం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*