తూర్పున జన సైన్యం యుద్ధానికి సిద్ధం

జనసేనాని నియమించిన ఫోర్ మెన్ కమిటీ తూర్పుగోదావరి జిల్లాను 20 రోజుల పాటు చుట్టేసింది. నియోజకవర్గాలవారీగా మెరికల్లాంటి పార్టీ సైన్యాన్ని గుర్తించింది. వీరందరితో రాజమండ్రిలో సమావేశమై దిశా దశా లను అంశాలవారీగా పెద్దలు వివరించేశారు. అంతే కాదు కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేశారు. సదస్సులో మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు నిర్వాహకులు. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలనుంచి వచ్చిన జనసేన కార్యకర్తలతో రాజమహేంద్రి సందడిగా మారింది. మహిళా నేతలు సదస్సులో తమ నాయకుడి సేవా నిరతిని రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తమ అదరగొట్టే ప్రసంగాల్లో అందరిని ఆకట్టుకున్నారు.

కీ రోల్ పోషిస్తున్న రాఘవయ్య…

జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీ నిర్మాణంలో ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా మూడు వారాలపాటు జిల్లా అంతా ఆయన సుడిగాలి పర్యటనే చేశారు. ఆయన తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఈ వ్యవహారాలు వెనుకనుంచి పర్యవేక్షిస్తున్నారు. 19 నియోజకవర్గాల ఎంపిక చేసిన కార్యకర్తల సదస్సులో రాఘవయ్య మాట్లాడుతూ పదవులు ఆశించి పార్టీలో వేలాడొద్దని పిలుపునిచ్చారు. నిర్మాతరం పార్టీకోసం వెచ్చించాలని అభ్యర్ధించారు.

త్వరలోనే పదవుల భర్తీ …

పదవి వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సమూల మార్పునకు పవన్ కళ్యాణ్ నడుం కట్టారని ఆయనకు అండగా అందరు నిలవాలన్నారు. పార్టీలో గ్రూప్ లు పదవులకోసం కొట్లాట ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతాయని అన్నారు వక్తలు. ప్రతిఒక్కరికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని త్వరలోనే మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఆ తరువాత జిల్లా కమిటీలు ఏర్పడతాయని వెల్లడించారు జనసేన నేతలు. పదవులు రానున్నట్లు నేతలు ప్రకటించడంతో మంచి జోష్ మీద వున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*