జ‌న‌సేన ఫీవ‌ర్ ఊపేస్తోందా…?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌కు మంచి ఊపు వ‌చ్చింది. అది కూడా కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో నాయకులు జ‌న‌సేన‌లోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నార‌నే వార్తలు హల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా.. ఇప్పటి వ‌రకు రాని ఊపు ఇప్పుడు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో నాయ‌కులు త‌మ త‌మ పంథాల్లో పార్టీల‌ను వెతుక్కుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలోనే ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోనూ త‌మ‌కు టికెట్ ద‌క్కద‌ని బావిస్తున్న చాలా మంది నేత‌లు.. ఇప్పుడు జ‌న‌సేనలోకి జంప్ చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో జ‌న‌సేన‌లో నేత‌ల ప్రవాహం మొద‌ల‌వుతుంద‌ని అంటున్నారు.

పవన్ పర్యటనలో…..

తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ, బీజేపీ, చివ‌రికి టీడీపీల నుంచి కూడా పలువురు కీలక నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఆయా పార్టీలలో తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని భావిస్తున్న సదరు నేతలు పవన్ కళ్యాణ్‌ పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మ‌రో ప‌ది ప‌దిహేను రోజుల్లో ప‌వ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. ఈ క్రమంలోనే వీరంతా జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాపుల విష‌యం జ‌గ‌న్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేప‌థ్యంలో వైసీపీ నుంచి కొంద‌రు కాపు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో వైసీపీకి గుడ్‌బై చెప్పే వారిలో ఎక్కువమంది జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా రు.రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలానికి చెందిన వైసీపీ ముఖ్యనేత ప‌వ‌న్ పంచ‌కు చేర‌తాడ‌ని స‌మాచారం.

ముమ్మడి వరం నేత కూడా….

ముమ్మిడివరం నుంచి వైసీపీ టికెట్‌ ఆశించిన మరో నేత జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన సదరు నేతకు ముమ్మిడివరం టికెట్‌ ఇస్తారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. రాజమహేంద్రవరంలో బీజేపీ ప్రజాప్రతినిధి, కాపు సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉన్న నేత కూడా జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నటు సమాచారం. సదరు బీజేపీ నేత భార్య ఇప్పటికే జనసేనకు బహిరంగమద్దతు ప్రకటించారు. బీజేపీ నేత.. కొన్ని నెలల క్రితం టీడీపీలో చేరతారని రాజమహేంద్రవరం రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగింది. టీడీపీ నుంచి రాజమహేంద్రవరం లోక్‌సభ సీటు ఇస్తారని ప్రచారమూ జోరుగాసాగింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో జనసేన వైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది.

టీడీపీ మాజీ ప్రతినిధి…….

అదేవిధంగా అదికార టీడీపీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి తనకు టికెట్‌ హామీ ఇవ్వకపోతే నెల రోజులలో బయటకు వెళ్లిపోవడానికైనా సిద్ధమేనంటూ ఇప్పటికే అనుచరుల వద్ద క్లారిటీ ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే తనకు సీఎం టికెట్‌ హామీ ఇచ్చారని పార్టీమారే యోచనలేదంటూ బయటకు మాత్రం గంభీరంగానే చెప్తున్నారు. మొత్తం మీద జిల్లాలో వైసీపీ, బీజేపీ కీలక నేతలతోపాటు.. ఒకరిద్దరు టీడీపీ నాయకులూ జనసేనలోకి జంప్‌ చేయాలన్న కుతూహలంతో ఉన్నారు. మ‌రి వీరికి జ‌న‌సేనాని ఎలాంటి అవ‌కాశం ఇస్తాడో చూడాలి.

కాపు నేతల్లో ఎక్కువ మంది……

ఇక ఏపీలోని మిగిలిన జిల్లాల కంటే తూర్పుగోదావ‌రి జిల్లాలోనే జ‌న‌సేన ప్రభావం ఎక్కువుగా క‌న‌ప‌డుతోంది. ఇక్కడ ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు ఆయ‌న సామాజిక‌వ‌ర్గం ఎక్కువుగా ఉండ‌డం కూడా క‌లిసి రానుంది. గ‌తంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా ఇక్కడ ఆ పార్టీ నుంచి ఏకంగా న‌లుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా కాపు సామాజిక‌వ‌ర్గానికే చెందిన వారు కావ‌డం విశేషం. ఇప్పుడు జ‌న‌సేన కూడా ఇక్కడే కాస్త ఊపు తెచ్చుకుంటోంది. మ‌రి ఈ ఊపు ఎన్నిక‌ల్లో ఓట్లుగా మారుతుందో ? లేదో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*