జనసేనలో చేరేందుకు రెడీ అయిపోతున్నారే…!

ఏపీలో పొలిటిక‌ల్ హీట్ స్టార్ట్ అయ్యింది. గ‌తేడాది నుంచి విప‌క్ష వైసీపీ నుంచి టీడీపీలో చేరిక‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇప్పుడు జనసేనలో కూడా చేరికలు స్టార్ట్ అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లు వైసీపీలోకి వెళుతున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉన్న కొంద‌రు మాజీలు, రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్న వారు ఇప్పుడు కొత్త పార్టీ జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజాగా పోరాట యాత్ర ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ పోరాట యాత్ర‌లో ప‌వ‌న్ ముందుగా ఉత్త‌రాంధ్ర‌లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ర్య‌టించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మొదలయి…..

ప‌వ‌న్ పోరాట యాత్ర ప్రారంభమైన వెంట‌నే మాజీలు ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ప్ర‌జారాజ్యం, వైసీపీ నుంచి గుంటూరు, ఏలూరు ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయిన మాజీ కేంద్ర స‌ర్వీసుల అధికారి, కాపు వ‌ర్గానికి చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్ జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఆయ‌న‌కు ప‌వ‌న్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.ఇక గ‌తంలో ప్ర‌జారాజ్యంలో నూజివీడు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ముత్తంశెట్టి విజ‌య‌నిర్మిల దంప‌తులు ఎప్పుడో జ‌న‌సేన‌లో చేరిపోయారు. కృష్ణారావుకు ప‌వ‌న్ గుంటూరు, కృష్ణాతో పాటు పార్టీ ఉభ‌య‌గోదావ‌రి ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్‌కుమార్ కూడా జ‌న‌సేన‌లో చేరేందుకు ముహూర్త‌మే మిగిలి ఉంది.

పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్…

వట్టి వ‌సంత్ కుమార్, తోట చంద్ర‌శేఖ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్‌ను విశాఖ‌లో మీట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తోట చంద్ర‌శేఖ‌ర్ జ‌న‌సేన నుంచి ఏలూరు ఎంపీగా, వ‌ట్టి వ‌సంత్‌కుమార్ ఉంగుటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ లిస్టులోనే ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో మాజీ ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా (లల్లూ) జనసేనలో చేరబోతున్న‌ట్టు జిల్లాలో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ మేరకు లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య ఇచ్ఛాపురంలో చర్చలు జరిగాయని, ప‌వ‌న్ నుంచి కూడా ఇందుకు గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని స‌మాచారం. లల్లూ 2004లో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తొలిసారి సీఎం అయిన‌ప్పుడు ఇచ్ఛాపురం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత 2009లో ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయిన ఆయ‌న తిరిగి ఇప్పుడు ఇచ్ఛాపురం రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.

జనసేనలో చేరి….

ఇచ్ఛాపురంలో ఇప్ప‌టికే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్నారు. అక్క‌డ వైసీపీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఇప్పుడు ల‌ల్లూ జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్నారు. ఏదేమైనా రాజ‌కీయంగా ఖాళీగా ఉన్న నేత‌ల‌కు, స్త‌బ్దుగా ఉన్న వారికి, మాజీల‌కు ఇప్పుడు జ‌న‌సేన మంచి ఆప్ష‌న్‌గా మారిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*