జేడీఎస్‌కు మ‌రో తెలుగు పార్టీ మ‌ద్ద‌తు..!

టీఆర్ఎస్ బాట‌లోనే ఎంఐఎం వెళ్తోంది. సీఎం కేసీఆర్ వెంటే అస‌ద‌ుద్దీన్ ఉంటున్నారు. తాము ఒక్క‌టేన‌ని మ‌రోసారి నిరూపించారు. ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా క‌ర్ణాట‌క వెళ్లిన సీఎం కేసీఆర్ జేడీఎస్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌తో, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో భేటి కావ‌డం, ఎన్న‌ిక‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు జేడీఎస్‌కే ఓటు వేయాల‌ని కోర‌డం తెలిసిందే. అంతేగాకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో త‌న‌కు ఎదుర‌య్యే కీల‌క ప‌రీక్ష‌గా క‌న్న‌డ ఎన్నిక‌ల‌ను సీఎం కేసీఆర్ చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను ఓడించి, క‌న్న‌డ నుంచే తానంటే ఏమిటో దేశానికి చెప్పాల‌న్న ప‌ట్టుద‌ల‌తో త‌న‌దైన శైలిలో వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు.

ఎంఐఎం కూడా జేడీఎస్ కు…..

తాజాగా ఎంఐఎం కూడా జేడీఎస్‌కే జై కొట్టింది. క‌ర్ణాట‌క శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ట్లేద‌ని ప్ర‌క‌టించింది. జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి, ప్ర‌చారంలో పాల్గొంటామ‌ని ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్‌, బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డంలో ఆ రెండు పార్టీలు విఫ‌లం అయ్యాయ‌ని ఆరోపించారు. క‌ర్ణాట‌క‌లో తెలుగు ఓటర్లు నిర్ణ‌యాత్మ‌కంగా ఉన్నారు. బెంగ‌ళూరు, బ‌ళ్లారి త‌దిత‌ర ఏపీ, తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో బ‌ల‌మైన‌వ‌ర్గంగా ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో క‌న్న‌డ త‌ర్వాత ఇత‌ర భాష‌లు మాట్లాడేవారిలో 9 శాతంతో మొద‌టి స్థానంలో ఉర్దూ ఉండ‌గా ఆ త‌ర్వాత 8.17శాతంతో తెలుగు ఉంది. దీనిని బ‌ట్టే అర్థ‌మ‌మ‌వుతోంది క‌న్న‌డ‌లో ఇత‌రుల ప్ర‌భావం ఏ స్థాయిలో ఉండ‌బోతుందో.

పది నియోజకవర్గాల్లో…..

ప్ర‌స్తుతం బెంగ‌ళూరు న‌గ‌ర ప‌రిధిలోని 28 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సుమారు 10 నియోజ‌వ‌ర్గాల్లో గెలుపోట‌ములను శాసించే స్థాయిలో తెలుగు ప్ర‌జ‌లు ఉన్నారు. బెంగ‌ళూరు, బ‌ళ్లారి, రాయ‌చూరు, కొల్లార్‌, చిక్క‌బ‌ళ్లాపుర, మైసూరు, కొప్ప‌ళ‌, చిత్ర‌దుర్గ‌, దావ‌ణ‌గెర, యాద‌గిరి త‌దిత‌ర ప్రాంతాల్లో కోటిమందికిపైగా తెలుగు మాట్లాడే ప్ర‌జ‌లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వ్యూహాత్మ‌కంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జేడీఎస్ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఎంఐఎం నేత అస‌ద‌ద్దీన్ ఓవైసీ కూడా ప్ర‌చారంలో పాల్గొంటాన‌ని చెప్ప‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రింకుంది.

ఇద్దరూ రంగంలోకి దిగి…..

తెలుగు, ఉర్దూ మాట్లాడే ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి ఈ ఇద్ద‌రు నేత‌లు రంగంలోకి దిగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే బీజేపీ త‌రుపున ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి రాచుకూరు, కొప్ప‌ళ ప్రాంతంలో ప్ర‌చారం చేశారు. ఇక కాంగ్రెస్ త‌రుపున చిరంజీవి ప్ర‌చారం చేయ‌నున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా జేడీఎస్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. కర్ణ‌టాక జ‌నాభాలో కీల‌కంగా ఉన్న తెలుగు, ఉర్దూ మాట్లాడే ప్ర‌జ‌ల ఓట్లు జేడీఎస్‌కు ప‌డిన‌ట్ల‌యితే క‌న్న‌డ‌నాట స‌రికొత్త రాజ‌కీయ ముఖచిత్రం ఆవిష్క‌ృతం అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*