ఈ అన్నదమ్ములు తెలివైనోళ్లే

Nandamuri Suhasini Kukatpally

ఎన్నడూ లేనిది తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ప్రజల్లో బోలెడంత ఆసక్తి ఏర్పడింది. కేసీఆర్ గెలుపు ధీమాతో ఐదు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయాడు. అయితే ఈసారి తెలంగాణాలో అందరిని ఎక్కువగా ఆకర్షించిన నియోజకవర్గం కూకట్ పల్లి. అక్కడ దివంగత హరికృష్ణ కూతురు సుహాసిని ప్రజకూటమి తరుపున పోటీ చేసింది. బాలయ్య బాబు.. అన్న కూతురు సుహాసిని ని దగ్గరుండి నామినేషన్ వేయించడం, ఆమె కోసం ప్రచారం చెయ్యడం, చంద్రబాబు కూడా ప్రచారానికి రావడంతో… సుహాసిని గెలు ఖాయమనుకున్నారు. ఇక బాలయ్య, బాబు ప్రచారానికి వచ్చారు అక్క కోసం తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ప్రచారం చేస్తే బావుండును అన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అక్క కోసం రాలేదు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అక్క గెలవాలని కోరుకున్నారు. అలాగే తమ సపోర్ట్ అక్కకే అంటూ సోషల్ మీడియాలో చెప్పారు కానీ.. అక్క కోసం కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.

మరి ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు రాకపోవడమే మంచిదైంది. నిజంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అక్క కోసం ప్రచారానికి వచ్చి ఉంటె కేటీఆర్ కి కేసీఆర్ కి వ్యతిరేఖులయ్యేవారు. ఎందుకంటే తెలంగాణాలో టీఆరెస్ క్లిన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో కూకట్ పల్లి లో సుహాసిని ఘోరమైన తేడాతో ఓటమి పాలయ్యింది. బాబాయ్ బాలయ్య, మావయ్య చంద్రబాబు అన్న తారకరత్న ప్రచారాలు, హరికృష్ణ మరణం కూడా సుహాసినిని విజయతీరానికి చేర్చలేకపోయింది. ఇక ఎవరెన్ని ప్రెస్ మీట్స్ పెట్టినా టీఆరెస్ ముందు అన్ని బలాదూరే అయ్యేవి. మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెలివిగా అక్క కోసం ప్రచారం చెయ్యకుండా తెలివైన పనిచేశారు. ఒకవేళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి వస్తే టీఆరెస్ కి వ్యతిరేఖులు గా మిగిలిపోవాల్సి వచ్చేది.

Telangana election results 2018

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*