ఎన్టీఆర్ వాచ్ అన్ని కోట్లా?

junior ntr watch cost

మన సినీ స్టార్స్ ఏదొక ఫంక్షన్ కి వచ్చినప్పుడు వారు ఏ బట్టలు వేసుకున్నారు..చెప్పులు, షూస్ ఏ బ్రాండ్ వి వేసుకున్నారు..వాచ్ లు ఏ కంపెనీ వి ధరించారు అన్న డిస్కషన్స్ ఈమధ్య హాట్ టాపిక్ గా మారాయి.. లేటెస్ట్ గా ఒక సినిమా ఫంక్షన్ కి సైటీలిష్ స్టార్ అల్లు అర్జున్ వేసుకొచ్చిన బట్టలు మీదే కొన్ని రోజులు టాలీవుడ్ లో చర్చ జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది.

రెండున్నర కోట్లా….?

నిన్న ఎన్టీఆర్ రాజమౌళి కుమారుడు పెళ్లి కోసం హైదరాబాద్ నుండి జైపూర్ కి వెళ్లారు. ఎన్టీఆర్ తో పాటు నాని..రానా కూడా వెళ్లారు. అక్కడ చేరుకున్నాక వారిని మీడియా వారు ఫొటోస్ తీశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ను హైలైట్ చేస్తూ ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో చూసిన వారు షాక్ అయ్యారు. దాని ధర గూగుల్ లో సెర్చ్ చేస్తే అక్షరాలా రూ. 2.20 కోట్లు అని ఉంది.

రేసుల్లో పాల్గొనే వారు…

ఆరెంజ్ కలర్ లో ఉండే ఈ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీకి చెందింది. ఇటువంటి కాస్టలీ వాచ్ లు ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు ధరిస్తుంటారు. పైగా ఈ కంపెనీకి సంబందించిన వాచెస్ లిమిటెడ్ ఎడిషన్స్ లో ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ధరించిన వాచ్ వరల్డ్ మొత్తం లో 500 వరకు మాత్రమే ఉన్నాయట. ఆ 500 వాచెస్ లో ఎన్టీఆర్ ది ఒకటి. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*