కొంగర కలాన్ కదం తొక్కింది…!

కేసీఆర్ అనుకున్నది సాధిస్తాడు. పదిరోజుల క్రితం గులాబీ సైన్యానికి సభ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చిన కేసీఆర్ దాన్ని విజయవంతంగా పూర్తి చేసేంత వరకూ వెంటపడుతూనే ఉన్నారు. కొంగర కలాన్ లో గులాబీ గుబాళించింది. నిన్నట ి నుంచే లక్షలాది మంది ప్రజలు కొంగర కలాన్ చేరుకుంటుడటం సభను ఎంత సీరియస్ గా కేసీఆర్ తీసుకున్నారో అర్థమవుతుంది. ప్రగతి నివేదన సభ పేరిట కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయిన సంగతి తెలిసిందే.

పోటెత్తిన జనం……

కొంగర కలాన్ కు జనం పోటెత్తారు. లక్షలాది మంది ప్రజలు జనం వివిధ రకాల వాహనాలతో తరలి వచ్చారు. ట్రాక్టర్లు, సైకిళ్లు, బైక్ లు, బస్సులు, లారీలు ఇలా ఒకటేమిటి అన్ని వాహనాలు కొంగర కలాన్ కే దారి తీశాయి. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు భోజనం ఏర్పాట్లు దగ్గరుండి అందే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం వంటివి కల్పించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ ఛార్జి తమ ప్రాంతం నుంచి ఇరవై వేల నుంచి ఇరవై అయిదు వేల మంది వరకూ జనాన్ని సమీకరించగలిగారు.

జనాన్ని చూసి……

కేసీఆర్ సభా వేదికపైకి వచ్చి చూసిన వెంటనే పులకించి పోయారు. జనసంద్రాన్ని తలపిస్తోందన్నారు. ఈరోజుే ఉదయం నుంచి మొత్తం 19 దారుల నుంచి వాహనాల్లో ప్రజలు పోటెత్తడంతో పోలీసులు కూడా ఒక దశలో కంగారు పడ్డారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందేమోనన్న ఆందోళన పడ్డారు. అయితే క్రమశిక్షణతో కార్యకర్తలు ముందుకు వెళ్లి వారికి కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి ఉంచడంతో పెద్దగా సమస్య ఎదురు కాలేదు.

సభ సక్సెస్ కాని…..

టీఆర్ఎస్ చెప్పినట్లు 25 లక్షల మంది జనం వస్తారని చెప్పినప్పటికీ ఆ సంఖ్యకు చేరుకోకున్నా….కొంగర కలాన్ మాత్రం కదం తొక్కిందనే చెప్పాలి. కొంగర కలాన్ సభతో పార్టీకి కేసీఆర్ మంచి హైప్ తెచ్చారు. ఈ సభతో ఎన్నికల వేడిని పుట్టించారు కేసీఆర్. తాను ఉద్యమం చేపట్టిన నాటి నుంచి నాలుగున్నరేళ్ల వరకూ వివిధ పథకాలను కేసీఆర్ తన ప్రసంగంలో చోటిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తాను పడ్డ శ్రమను ప్రజలముందుంచారు. నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని నివేదించారు. మొత్తం మీద టీఆర్ఎస్ ప్రగతి నివేదిక పార్టీ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*