యుద్ధానికి సమయమిదే …!!

kcr plans on fedaral front

ముందస్తు గా ఎన్నికల కూత పెట్టేయాలని తహతహ లాడుతున్న కెసిఆర్ భారీ ప్రణాళికనే సిద్ధం చేసేసారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాలను సుడిగాలిలా చుట్టేయాలని టి సిఎం పక్కా ప్రణాళికతో రెడీ అయిపోయారు. సెప్టెంబర్ 2 న ప్రగతి నివేదన దేశ చరిత్రలో నిలిచేలా తలపెట్టాలన్నది ఆయన సంకల్పం. అందుకోసం ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేలమంది తక్కువ కాకుండా హాజరయ్యేలా చూడాలని బాధ్యులపై బాధ్యత పెట్టేశారు తెలంగాణ రాష్ట్ర సమితి దళపతి. 27 లక్షలమంది తో భారీ బలప్రదర్శన చేయాలని కెసిఆర్ తలంపు. ప్రత్యర్థులకు దడపుట్టించే జనాలను ఈ సభలో చూపి గ్రాండ్ ఓపెనింగ్స్ తో గులాబీ సినిమా తెలంగాణ ఎన్నికల తెర పై చూపాలని ముందుగా నిర్ణయించారు. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో టి బాస్ సభలు ప్లాన్ చేశారు. ఇలా అలుపెరగని రీతిలో ప్రత్యర్థి కి ఊపిరి సలపని వ్యూహం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కారు పార్టీ డిసైడ్ అయిపోయింది.

వరాలే వరాలు ….

ఇక ప్రతిచోటా కెసిఆర్ బహిరంగ సభలు హోరెత్తిపోనున్నాయి. ఈ సభలో రైతుబంధు, కంటివెలుగు, వంటి పథకాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు కెసిఆర్. ఇవే కాకుండా తాజాగా కెసిఆర్ వివిధ వర్గాలపై వరాల జల్లు కురిపించేశారు. మసీద్ లలో ఇమామ్ లకు నెలకు ఇకపై ఐదు వేలరూపాయలను ఇవ్వనున్నారు. దేవాలయాల్లో అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వారికి జీతభత్యాలు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అర్చకుల పదవీవిరమణ వయస్సు 55 నుంచి 65 కు మార్చేశారు. మరోపక్క మెప్మా ఉద్యోగులపై వరాలు, గురుకులాల్లో పనిచేసేవారిపై వరాలు, పేదవర్గాలకు ఉచితంగా 50 యూనిట్లు వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్ 100 యూనిట్లకు పెంచేశారు కెసిఆర్. ఇలా వరాల జల్లులతో తెలంగాణ ప్రజలను ముంచెత్తిన గులాబీ బాస్ ఇదే మంచి తరుణమని యుద్ధానికి పిలుపు ఇచ్చేందుకు ముహూర్తం పెట్టేశారు. అది ఫలిస్తుందా వికటిస్తుందా ? అన్నది వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*