మాటిస్తే….ట్విస్ట్..షాక్… ఉన్నట్లేనా?

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రిక కేసీఆర్ ఎన్నిక‌ల హీట్ పెంచుతున్నారు.. ముంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు.. ఇదే క్ర‌మంలో ముగ్గురు న‌లుగురికి త‌ప్ప‌ దాదాపుగా సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఇటీవ‌ల పార్టీ స‌మావేశంలోనూ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సెప్టెంబ‌ర్ నెల‌లోనే పార్టీ అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. మాట‌లు నేత‌ల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆ టికెట్లు ద‌క్క‌ని ముగ్గురు న‌లుగురు జాబితా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌నే టాక్ కూడా వినిపిస్తుండ‌డంతో ప‌లువురు నేత‌లు బిక్కుబిక్కుమంటున్నారు. అందులో తాము కూడా ఉన్నామేమోన‌నే అనుమానంతో తెగ ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, మ‌రో విష‌యం నేత‌ల్నిప‌ట్టిపీడిస్తోంది.

బాబూ మోహన్ కు……

అదేమిటంటే.. సీఎం కేసీఆర్ ఎంత ప‌క్కాగా మాటిస్తారో.. అంతే అనూహ్యంగా ట్విస్ట్ కూడా ఇస్తారు.. ఊహించ‌ని విధంగా షాక్ ఇస్తారు.. అంచ‌నాల‌కు అంద‌కుండా ముందుకు వెళ్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఎంద‌రో కీల‌క నేత‌లు ఈ అనుభ‌వాల్ని ఎదుర్కొన్నారు. మ‌రెంద‌రో క‌నుమ‌రుగు అయ్యారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు.. బావ‌బావ‌మ‌రుదులుగా పిలుచుకునే చ‌నువున్న నేత అదే ప‌రిస్థితిని ఎదుర్కొన‌బోతున్నారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు… ప్ర‌ముఖ సినీనటుడు, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా లేర‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. దీంతో బాబుమోహ‌న్‌కు ఊహించ‌ని షాక్ త‌ప్ప‌ద‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

కొద్దిపాటి మెజారిటీతోనే…..

నిజానికి.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బాబుమోహ‌న్ టీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్య‌మంలో కూడా పెద్ద‌గా పాల్గొన్న‌ది లేదు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ తెలంగాణ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌నే చెప్పుకోవ‌చ్చు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ త‌రుపున కీల‌క స‌మ‌యంలో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించారు. కానీ, 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బాబుమోహ‌న్ రాజ‌న‌ర్సింహ‌పై కొద్దిపాటి మెజారిటితోనే గెలిచారు. అదికూడా తెలంగాణ ఉద్య‌మ గాలిలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల నామినేష‌న్ టైంలో పార్టీలోకి వ‌చ్చిన బాబూమోహ‌న్ రాజ‌న‌ర్సింహ‌ను ఓడించి పెద్ద సంచ‌ల‌న‌మే క్రియేట్ చేశారు.

ఆంథోల్ అన్నింటికంటే…..

అయితే.. ఈ నాలుగేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేసిన ప‌నులు ఏమీ లేవ‌నే అసంతృప్తి ప్ర‌జ‌ల్లో, పార్టీ క్యాడ‌ర్లో నెల‌కొంది. మెద‌క్ జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాని ఆందోల్‌లో మాత్రం పార్టీ చాలా వీక్‌గా ఉంద‌ని కేసీఆర్ చేయించిన ప‌లు స‌ర్వేల్లో కూడా వ్య‌క్త‌మైంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలే ఓపెన్‌గా చెపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాబుమోహ‌న్‌కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా లేన‌ట్టు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రాజ‌న‌ర్సింహ లాంటి బ‌ల‌మైన నేత‌ను ఎదుర్కొనాలంటే.. పార్టీ త‌రుపున బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*