ఒకే దెబ్బకు అన్ని పార్టీలను …!!

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల తో అన్ని పార్టీలను ఒక్క దెబ్బతో మట్టికరిపించాలన్నది కెసిఆర్ ఆలోచనగా ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్న నేపధ్యం. టిడిపి హస్తంతో చెట్టాపట్టాలకు సిద్ధమౌతున్న పరిస్థితి. ఒకప్పటి తన మిత్రుడు కోదండరాం పార్టీ సైతం మెల్లగా ప్రజల్లోకి దూసుకుపోతున్న తీరు అన్ని పరిశీలించి వారెవ్వరూ అప్రమత్తం కాకుండానే అందరికి ఒకేసారి చెక్ పెట్టాలన్న ఆలోచనలతో టి బాస్ రిస్క్ కి తెగబడ్డారని చెబుతున్నారు. అందుకే తాను ఎప్పటినుంచో ఉత్సహం చూపిస్తున్న ఎన్నికలకు టి బాస్ రంగం సిద్ధం చేసి సమరానికి సై చెబుతూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారన్నది టాక్.

అంత ఈజీ కాదా …?

మంచి జోష్ మీద వున్న గులాబీ కారు స్పీడ్ కు బ్రేక్ వెయ్యడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంగబలం అర్ధబలం దండిగా ఉండటంతో బాటు ప్రతివారికి వ్యక్తిగత లబ్ది చేకూర్చేలా కెసిఆర్ ప్రారంభించిన పథకాలు టిఆర్ఎస్ కి కొండంత అండగా నిలుస్తాయన్న నమ్మకాన్ని కారు పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో వున్నాయి. ముందస్తుకు వెళితే లాభమా నష్టమా అనే అంశాలపై అనేక ప్రయివేట్ సర్వేలు ఇప్పటికే చేయించిన కెసిఆర్ పాజిటివ్ గా వచ్చిన నివేదికల ఆధారంగానే సమరానికి కాలు దువ్వారని అంటున్నారు విశ్లేషకులు.

అనైక్యతే అధికారపార్టీ బలం …?

తెలంగాణాలో ప్రస్తుతం ఏ పార్టీకి సఖ్యత లేనేలేదు. ఒంటరిగా బరిలోకి దిగి అధికారపార్టీని సవాల్ చేసి అధికారంలోనికి వచ్చే సత్తా లేదన్నది టీఆర్ఎస్ అంచనా. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, జనసేన, కోదండరాం పార్టీ వేటికి టీఆరెస్ కు ధీటుగా బూత్ స్థాయి యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరు. కొద్దొగొప్పో కాంగ్రెస్ కి యంత్రాంగం వున్న ఆ పార్టీ గ్రూప్ ల గోలతో వున్న బలం కోల్పోతుంది. బిజెపి నామమాత్రపు గుర్తింపే వుంది. కామ్రేడ్ లు జనసేన కలిసినా క్షేత్ర స్థాయిలో సినిమాలేదన్నది టి బాస్ ఆలోచన అంటున్నారు. ఈ నేపథ్యంలో సమయం చూసి శత్రువులందరిని ఒకేసారి కదనరంగంలో పరిగెట్టించేస్తామన్న నమ్మకమే గులాబీ బాస్ ముందస్తుకు ముందడుగుగా ఉందంటున్నారు. కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ సక్సెస్ కావడంతో మరింత ముందుకు వెళతారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*