వీరు కలిస్తే వారికి లాభమేనా..?

తెలంగాణాలో ముందస్తు నగారా మోగాక పొత్తు పొడుపులు వేగవంతం అయ్యాయి. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది బద్ద శత్రువులైన కాంగ్రెస్ టిడిపి. ఈ రెండు పార్టీలు ఏ పార్టీతో కలిసినా ఇంత చర్చ జరిగేది కాదు. కానీ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేయడమే టిడిపి లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇందిరా గాంధీ చేయని ప్రయత్నం లేదు. పార్టీ ఆరంభం నుంచి కాంగ్రెస్ కుట్రలను కుతంత్రాలను ధైర్యంగా ఎదురొడ్డి పోరాడి నిలిచారు ఎన్టీఆర్. అయితే ఆయన ఆశయాలకు భిన్నంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా తెలుగుదేశం కాంగ్రెస్ లు తెలంగాణ, ఏపీలలో చేతిలో చెయ్యి వేసుకుని నడవకతప్పని పరిస్థితి ఇప్పుడు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆ రెండు పార్టీలకు రాజకీయ అవసరం.

గులాబీ బాస్ మొదలెట్టేశారు …

ఇక తెలంగాణాలో తనను అధికారంలోకి రాకుండా ఏర్పడుతున్న మహాకూటమి పై కస్సుమన్నారు కారు పార్టీ అధినేత. ముఖ్యంగా ఎవరు ఎవరితోనైనా రాజకీయాల్లో కలుస్తారని కానీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తు మాత్రం అత్యంత జుగుప్సాకరమని, అసహ్యంగా ఉందన్నారు కెసిఆర్. ముఖ్యమంత్రి తనయుడు ఆపద్ధర్మ మంత్రి కెటిఆర్ ఈ పొత్తు పై భిన్నంగా స్పందించారు. ఎన్టీఆర్ ఏ ఆశయంతో పార్టీ పెట్టారు? కానీ వీరు చేస్తున్నది ఏమిటి? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఈ పొత్తు చూసి ప్రజలకు ఏమనిపించినా తనకు మాత్రం నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. ఇద్దరు గెడ్డపోళ్ళు ఒక్కటయ్యారు అంటూ చంద్రబాబు, ఉత్తమకుమార్ రెడ్డి లపై సెటైర్ విసిరారు. ఇలా తండ్రి కొడుకులు తమదైన శైలిలో టిడిపి, కాంగ్రెస్ కలయికపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

పొత్తు సరే….. పనవుతుందా …?

తెలంగాణ లో కాంగ్రెస్, టిడిపి పొత్తులు ఎలా వున్నా క్యాడర్ మనస్ఫూర్తిగా ఒకరి గెలుపుకోసం మరొకరు పనిచేసేది అనుమానమే అన్న టాక్ వినవస్తుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లీడర్ విజయశాంతి వ్యాఖ్యానించడం గమనిస్తే గ్రౌండ్ లో అదే ఉందన్న టాక్ టిఆర్ఎస్ సర్వేల్లో వెల్లడైంది. దాంతో గులాబీ శిబిరం నిశితంగా పొత్తు తంతును వీక్షిస్తూ వారి అడుగులు పరిశీలిస్తుంది. పొత్తు తో బాటు సీట్ల లెక్కల్లో అసలు వ్యవహారం బయటపడుతుందని రెండు పార్టీల నేతల గంతులు ముఖ్యంగా టికెట్ పొత్తులో పోగొట్టుకునే కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యి రోడ్డెక్కుతారని గులాబీ అంచనా. వీరిద్దరికి తోడు టిజెస్, సిపిఐ కూడా ఉండటంతో సగం సీట్లు వారికే సమర్పించుకుంటే కాంగ్రెస్ బలహీన పడినట్లేనని గులాబీ శిబిరం లెక్కలు వేసుకుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*