బి ఫారంలు ఇచ్చేది డౌటేనా …?

గులాబీ బాస్ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు వీరే అంటూ 105 మంది తో తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా టికెట్లు పొందిన వారంతా పెద్ద ఎత్తునే సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ కొందరిలో మాత్రం ఒక భయం వెంటాడుతుంది. అదే చివరివరకు తామే అభ్యర్థులుగా ఉంటామా లేదా అని. ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలలు ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల చాలా మందికి బి ఫారం చేతికి వస్తుందా లేదా అన్న సందేహాలు మొదలు అయిపోయాయి. దాంతో తమ తమ నియోజకవర్గాలను వీడకుండా హల్చల్ మొదలు పెట్టారు తాజా మాజీలు. అయితే ప్రత్యర్థుల ఎత్తుగడలు, టికెట్లను బట్టి కేసీఆర్ మార్పు చేర్పులు చేస్తారన్న భయం ఇప్పుడు బయల్దేరింది.

కెసిఆర్ చెప్పింది చెయ్యరా …?

టీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ చెప్పింది ఏదీ చెయ్యరనే భయం ఆ పార్టీ క్యాడర్లో బలంగా నాటుకుపోయింది. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్త్రి దళితుడే అని నాడు ప్రకటించారు కెసిఆర్. అయితే టీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చాకా ఆ స్లోగన్ పక్కన పెట్టి తానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో టిడిపి తో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల ఫలితాలు రాకుండానే జై ఎన్డీయే అన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేసి కాపలా కుక్కలా సోనియా ముందు పడివుంటానన్నారు కేసీఆర్.

అసంతృప్తుల ప్రయత్నాలు……

అయితే ఎన్నికలకు ముందు సడెన్ గా పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు తరువాత . ఇలా విభిన్న కోణాలు చూపించే కెసిఆర్ తమ చేతిలో బి ఫారాలు పెట్టె వరకు గ్యారంటీ లేదన్న ఆందోళన టి అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే రోజు వారి గా తాజా మాజీ ఎమ్మెల్యేల పనితీరు ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు కేసీఆర్. సర్వేలపై సర్వేలు చేయిస్తూ పనితీరు సక్రమం గా లేనివారికి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. దాంతోనే అనుమానాలు బయలుదేరాయి. మరో వైపు టిక్కెట్ దక్కని వారు కూడా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. మరి టి బాస్ ఎప్పుడు ఏమి చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*