‘కాలా’ ప్రీ రివ్యూ – అద్భుతంగా నటించిన రజినీ

‘కబాలి’ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి కబాలి డైరెక్టర్ దర్శకత్వం వహించిన ‘కాలా’ సినిమాతో నేడు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. రజినీకాంత్, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి జంటగా నటించిన ‘కాలా’ సినిమా మంచి అంచనాల నడుమ ఈ రోజు గురువారం విడుదలైంది. అయితే ‘కాలా’ సినిమా టాక్ ఎలా ఉందంటే….

ఈ సినిమా మొత్తం ముంబై బ్యాగ్ద్రోప్ లో కొనసాగుతుంది. అసలు పాయింట్ లోకెళితే కరికాలుడు ఉరఫ్ కాలా(రజినీకాంత్) ముంబై స్లమ్ ఏరియా లో నివసించే సాధారణ మనిషి. అయితే కాలా కి అందరూ బావుండాలి అనే మనస్తత్వామ్ ఉంటుంది. అందుకే… వారి కష్టాలను తీరుస్తూ అక్కడి మురికివాడ ప్రజలందరికి నాయకుడవుతాడు. అక్కడి ప్రజలకేం కష్టం వచ్చిన ముందుండి అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. అయితే అక్కడి మురికి వాడని ఒక రాజకీయనాయకుడు కబ్జా చెయ్యాలని చూస్తాడు. అందుకే అక్కడి ప్రజలకి ఏదో ఒకటి చెప్పేసి ఖాళీ చేయించాలని చూస్తాడు. అయితే దీన్ని కాలా ఎలా అడ్డుకున్నాడన్నదే కాలా మిగతా కథ.

మరి ఈ కథవింటున్నప్పుడు చాలాసార్లు చూసిన, విన్న కథలాగే అనిపిస్తుంది. ఎక్కడా కొత్తదనం అనే మాటే ఉండదు. అసలు రజినీకాంత్ ఇలాంటి కథలను ఎందుకు ఒప్పుకుంటాడు అనే డౌట్ మాత్రం ‘కాలా’ సినిమా ని చూసిన ప్రతి ఒక్కరిలో రావడం సహజం. అయితే కథలో కొత్తదనం లేకపోయినా.. రంజిత్ పా మాత్రం సినిమాని చాలా థ్రిల్లింగ్ గా నడింపించాడా అనిపిస్తుంది. ఇక రజినీకాంత్ ని బాగా వాడుకున్నాడు. రజిని స్టయిల్ ని కూడా కావాల్సినంత వాడుకున్నాడు. ఊరమాస్ గెటప్ లో కారికలుడిగా రజినీకాంత్ ఎప్పటిలాగే నటనలో అదరగొట్టేసాడు. సినిమాని రజినీకాంత్ ఒంటి చేత్తో నడిపించాడు. ఇక ఈ సినిమా లో మెయిన్ హైలెట్స్ రజినీకాంత్ కి రాజకీయనాయకుడైన నానా పాటేకర్ కి మధ్యన వచ్చే సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే డైలాగ్ డెలివరీ, స్టయిల్ తోనే కొట్టేసిన రజిని ఈసారి కామెడీని కూడా టచ్ చేసి సూపర్ అనిపించాడు.

ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా వుంది. అలాగే ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకునేలా ఉన్నది. ఇక పాటల పరం గా కాలా ఆల్బమ్ ప్లాప్. కానీ నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. ఇక రంజిత్ పా దర్శకత్వం మాత్రం కబాలి కన్నా.. కాలా కి బావుందని చెప్పాలి. నిర్మతగా ధనుష్ మామ రజినీకాంత్ కోసం ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*