కన్నా ఈ పార్టీలో చేరినట్లేనా?

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి గుడ్ బై చెప్పేస్తున్నారా ..? అవుననే పొలిటికల్ టాక్ వినిపిస్తుంది. బిజెపికి ఏపీలో కష్టకాలం దాపురించిందని లెక్కలు వేసిన కన్నా తన దారి తాను చూసుకోవడం మంచిదనే అభిప్రాయంతో కమలానికి టా టా చెప్పడానికి ఫ్యాన్ గాలిలో సేదతీరాలని భావిస్తున్నట్లు సమాచారం. కన్నా కమలానికి దూరం జరుగుతారని తెలియడంతో వైసిపి ఆయనకు బంపర్ ఆఫర్ తో ఎదురు వెళుతుంది. మరోపక్క ఏ పార్టీలో చేరితే మంచిది అన్న అంశంపై ఇప్పటికే తన మిత్రులు, మేధావులతో గత కొంత కాలంగా ఏ పార్టీ అయితే బావుంటుందనే చర్చలు నిర్వహించినట్లు తెలియవచ్చింది.

వైసిపి ? జనసేన ?

లక్ష్మి నారాయణ పార్టీ మారితే రెండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసిపిలో, రెండు జనసేనలో చేరే అవకాశాలే మెండుగా వున్నాయి. రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీ వైపు దృష్టి సారిస్తారు అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది. గత కొంతకాలంగా ఆయన బిజెపి వ్యవహారశైలిపై విసుగెత్తి పోయారని అంటున్నారు. దాంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు బిజెపి ని వీడారని సమాచారం.

అధ్యక్ష పదవి లేనందునేనా …

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ను నియమిస్తారని ఆయన కమలంతో చెయ్యి చెయ్యి కలిపినప్పుడే ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. సీన్ కట్ చేస్తే బిజెపి ఇప్పుడు ఆయన పేరు పక్కన పడేసింది అని టాక్. దాంతో బాటు ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో కేంద్రం సాయం విషయంలో అంతా బిజెపిని నిందిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ మారకపోతే మొత్తానికే దెబ్బయి పోతాననే భయం పట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు. దాంతో ఆయన వారం రోజులుగా తనకు అత్యంత ఆప్తులతో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు ఏ పార్టీకి బావుంటుందని ఆలోచన చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఆయన చేరబోయే పార్టీ తేలనుంది. ఇంకోపక్క అనుభవజ్ఞుడు సౌమ్యుడు అయిన కన్నాకు వైసిపి, జనసేన వర్గాలు గాలం వేస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారో చూడాలి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*