క‌ర్ణాట‌క‌లో సీఎం పోస్టుకు క్యూ..!

సీఎం పోస్టంటే మాట‌లా? రాష్ట్రం మొత్తంపైనాఅధికారం చెలాయించ‌గ‌లిగిన ఏకైక పోస్టు. మ‌రి ఆ పోస్టు వ‌ద్ద‌నే వారు ఎవ‌రు ఉంటారు? ఇప్పుడు క‌ర్నాట‌క‌లోనూ ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇక్క‌డ శ‌నివారం అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రేపు (మంగ‌ళ‌వారం) ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఆ త‌ర్వాత పార్టీల జాత‌కాలు తేలిపోనున్నా యి. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం సిద్ద‌రామ‌య్యేన‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. సీఎం అయ్యేది య‌డ్యూర‌ప్పేన‌ని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. ఇప్పుడు సీఎం రేసులో నాయ‌కుల జాబితా ప‌రుగు ప‌రుగు పెడుతోంది. గంట‌కో పేరు చొప్పున వెలుగు చూస్తోంది.

హంగ్ ఏర్పడుతుందని తేలడంతో…..

దీంతో క‌ర్ణాట‌క రాజ‌కీయాలు మ‌రింత వేడి పుట్టిస్తున్నాయి. వాస్త‌వానికి ఎన్నికలు ముగిసిన గంట‌లోనే క‌ర్ణాట‌క‌లో హంగ్ ఏర్ప‌డుతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. దీంతో నాయ‌కులు ఏం జ‌రుగుతుందోన‌ని రెండు క‌ళ్లూ మూసుకుని రేప‌టి కోసం వేచి చూస్తున్నారు. ఇక‌, ఒకరు కాదు ఇద్దరు కాదు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పలువురు నేతలు సీఎం రేసులోకి వచ్చారు. ఎన్నికల ముందు.. ప్రధానంగా ముగ్గురు సీఎం అభ్యర్థులే అగుపించగా ఇప్పుడు మాత్రం చాలా మంది రేసులోకి వచ్చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా. సిద్ధరామయ్య, బీజేపీ సీఎం నేత‌గా యడ్యూరప్ప, జేడీఎస్ సీఎం అభ్య‌ర్థిగా కుమారస్వామి.. వీరు ముగ్గురూ కర్ణాటక సీఎం రేసులో నిలిచారు.

మల్లిఖార్జునఖర్గేతో పాటు…..

అయితే హంగ్ తరహా పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది నేతలు రేసులోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దళిత సీఎం అనే నినాదం వినిపిస్తోంది. దళితుడిని సీఎంగా నియమించే పక్షంలో జేడీఎస్ మద్దతు పలికే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన దళిత నేతలు కొందరు రేసులోకి వచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మునియప్పలు ఒక్కసారిగా రేసులోకి వచ్చారు. వీరిలో ఛాన్స్ ఎవరికైనా ఉండవచ్చు అనే మాట వినిపిస్తోంది. అధిష్టానం మొగ్గు ఖర్గే వైపు ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ వాళ్లు ఎన్నికల ముందు యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.

బీజేపీ కూడా…..

అయితే, ఇప్పుడు మాత్రం హంగ్ వ‌స్తుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో పలు పేర్లు సీఎం రేసులో నిలుస్తున్నాయి. బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే పేర్లు ఈ జాబితాలోకి రావడం విశేషం. ఇక జేడీఎస్ కూడా ఉండనే ఉంది. ఛాన్స్ దొరికితే సీఎం సీటును అధిష్టించాలనేది కుమారస్వామి కోరిక. అలాగే దేవేగౌడ మరో కుమారుడు రేవణ్ణ పేరు కూడా లిస్టులో ఉంది. అస్పష్ట రాజకీయ పరిణామాల మధ్యన వీరిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోన‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్ట‌మ‌య్యే సూచ‌న‌లున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*