పనిలో పడ్డ గులాబీ బాస్ .. అందుకేనా ..?

kchandrasekharrao-busy-with-welfare-schemes

ఆయన ముఖ్యమంత్రి అయినా పని చేసేది లేదు. ఫామ్ హౌస్ లోనే వుంటారు. కనీసం సెక్రెటేరియట్ కు కూడా రారు. ఇది మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై విపక్షాలు చేసిన విమర్శల్లోని కొన్ని. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కెసిఆర్ పనిచేయకతప్పడం లేదు. అధికారులతో సమీక్షలు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే బాధ్యత ఒక పక్క కొలువుతీరని మంత్రి వర్గ లెక్కల్లో పని మరోపక్క గులాబీ బాస్ కి క్షణం తీరిక లేకుండా చేసేస్తున్నాయి.

అన్ని తానై …

అధికారం లోకి వచ్చిన కారు పార్టీ సర్కార్ పూర్తి స్థాయిలో పని ఇంకా మొదలు పెట్టలేదని ప్రజలు భావించకుండా జాగ్రత్త పడుతున్నారు కేసీఆర్. అన్ని తానై పాలనలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకుంటూ కొత్త ముఖ్యమంత్రిని చూపిస్తున్నారు. ఒక పక్క పార్టీ బాధ్యతలు కెటిఆర్ నెత్తిన పెట్టడంతో పాలన బాధ్యత పై స్వేచ్ఛగా దృష్టి సారించారు ఆయన. నిత్యం మీడియా లో తనపై చర్చ నడిచేలా వ్యవహారం నడిపిస్తున్నారు.

ప్రాజెక్ట్ ల బాట పట్టనున్న టి సిఎం …

టిఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తెలంగాణ నీటి ప్రాజెక్టులు ఆగిపోతాయని ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు గులాబీ బాస్. అదే తామే అధికారం సాధిస్తే వచ్చే వేసవికి తాగు సాగునీటికి సమస్య లేకుండా చూస్తా అన్నారు కెసిఆర్. దాంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే సాగుతున్న ప్రాజెక్ట్ పనులు త్వరిత గతిన పూర్తి చేయించాలి. ఇవన్నీ ఒక షేప్ కి వచ్చేలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత రాజకీయ లబ్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ లెక్కల్లోనే ఆయన కొత్త ఏడాది తొలి రోజునుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో ముందుగా కాళేశ్వరం నుంచి పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్ పనులు నుంచి ఎత్తిపోతల పథకాల పనితీరు స్వయంగా పర్యవేక్షించి రానున్నారు. అనంతరం ఈ ప్రాజెక్ట్ లపై ఇంజనీర్లు ఇతర అధికారులతో విస్తృత స్థాయి చర్చ చేపట్టి అభివృద్ధి రుచిని ప్రజలకు చూపించాలన్న లక్ష్యం తో నడుస్తున్నారు. పనిచేయరు ఫామ్ హౌస్ లో పడకేస్తారన్న విమర్శకుల నోళ్ళు కూడా తనపనితీరుతో మూయించాలని గులాబీ బాస్ వ్యూహం కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*