బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేపై కాల్పులు… మృతి

kasumaheshreddy serious effort in gujajala

విశాఖ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగొట్టారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆయన ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో మావోయిస్టులు పలుమార్లు కిడారి సర్వేశ్వరరావును బెదిరించారు. అయితే ఎమ్మెల్యేపై కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని పోలీసులు ధృవీకరించారు. ఇప్పుడే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్యే,  మాజీ ఎమ్మెల్యే మృతి…….

ఈ కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే సోమ కూడా మృతి చెందారు.  కిడారి మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. దాడిలో 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కిడారి సర్వేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తొలిసారిగా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటకు వస్తుండగా ఆయనపై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడి చేసి కాల్పులు జరిపినట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*