కికి డ్యాన్స్ ఇక్కడకీ వచ్చేసింది….!

ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తోంది కికి డ్యాన్స్. ముఖ్యంగా కుర్రకారును బాగా ఆకర్షిస్తున్న ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు తీసింది. వందలమందిని చేతులు కాళ్ళు విరిగేలా గాయాల పాలు చేసేసింది. అయినా దీనిపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా వెర్రి తలలు వేస్తూనే వుంది. ఇప్పటివరకు అమెరికా, స్పెయిన్, మలేసియా, దుబాయి, వంటి అభివృద్ధి చెందిన దేశాలకు పరిమితం అయిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు భాగ్యనగర్ యూత్ ను ఆకట్టుకోవడం పోలీసుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది.

అసలు ఏం చేస్తారు…?

నడుస్తున్న కారులో కికి సాంగ్ ప్లే చేసి అందులో కెమెరా ఫిక్స్ చేసుకుని వెళుతున్న వాహనంలోనుంచి కిందకు దూకి ఆ పాటకు తగ్గ స్టెప్స్ వేసి తిరిగి కారులోకి చేరుకోవాలి. ఈ ప్రక్రియలో అనేకమంది ప్రాణాలు ఇప్పటికే గాలిలో కలిసిపోయాయి. క్లిష్టతరమైన ఈ అనుభూతి కుర్రకారులో కిక్ నింపుతుంది. ఫలితంగా వారు ఈ సాహసానికి ఒడిగడుతున్నారు. ఈ పిచ్చి పనికి బ్రేక్ వేసేందుకు ప్రపంచ దేశాలు అనేకం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

జరిమానాలు విధించినా….

కొన్నిదేశాల్లో పైకి డ్యాన్సర్స్ ను జైలుకి పంపుతుంటే మరికొన్ని చోట్ల భారీ జరిమానాలు విధిస్తు చెక్ పెడుతున్నారు. కికి డ్యాన్స్ హైదరాబాద్ కి పాకడంతో అప్రమత్తమైన ఖాకీలు ట్విట్టర్ ఇతర సామాజిక వేదికల ద్వారా హెచ్చరికలు జారీచేసేసారు. ఇలాంటి పనులు తీసి మీ ప్రాణాలు తీసుకోవడంతో బాటు పక్కవారి ప్రాణాలు తియ్యకండని వార్నింగ్ ఇచ్చేశారు పోలీసులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*